Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిCalendar | వి 99 న్యూస్ ఛానెల్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

Calendar | వి 99 న్యూస్ ఛానెల్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

హఠ యోగ ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు జర్నలిస్ట్ శంకరాచారి ఆధ్వర్యంలో వి 99 న్యూస్ ఛానెల్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ ను జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కెల్లేపల్లి సదానంద్, మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, డి ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రగుడ్ల వెంకటేష్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కారింగుల శంకర్ గౌడ్ మాట్లాడుతూ ఒక జర్నలిస్టుగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే మరోవైపు యోగ గురువుగా ప్రజలకు యోగ విద్య ద్వారా ఆరోగ్యాన్ని అందించడం అభినందనీయమని అన్నారు. నేటి కాలంలో యోగ సాధన ప్రతి ఒక్కరికి అవసరమని, యోగ ద్వారానే సంపూర్ణ శారీరక మానసిక ఆరోగ్యం సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్తులో యోగ విద్యను సమాజంలో మరింతగా విస్తరించాలన్న లక్ష్యానికి ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు తమవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.

- Advertisement -

అనంతరం యోగ గురువు శంకరాచారి మాట్లాడుతూ సమస్త మానవాళి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలనే సంకల్పంతో వేలాది సంవత్సరాల క్రితమే ఋషులు యోగ విద్యను అందించారన్నారు. ఈ యోగ విద్యను ప్రపంచమంతా గుర్తించి అనుసరిస్తోందని చెప్పారు. బాల్యం నుంచే యోగ జీవన విధానాన్ని పిల్లలకు అలవాటు చేస్తే మంచి ఆరోగ్యం, మంచి నడవడిక ఏర్పడుతాయని, చదువు సంధ్యలలో వారు ముందంజలో ఉంటారని వివరించారు.

ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకు యోగ సాధన ద్వారా వందశాతం చెక్ పెట్టవచ్చని పేర్కొన్నారు. ఇంతటి గొప్ప విద్యను నిరుపేదలకు చేరువ చేయడమే తమ ఆశ్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందుకు అవసరమైన వసతులు కల్పించి ప్రోత్సహించాలని నాయకులను, ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బాషపల్లి రమేష్ చారి, కాప్రా మండల అధ్యక్షులు మారోజు రమేష్ బాబు చారి, 28వ డివిజన్ అధ్యక్షులు బూడిద వెంకటేశ్, మాట్ల శ్రీనివాస్, హఠ యోగ ఆశ్రమ ఉపాధ్యక్షులు ఆకుల నర్సింహ, ప్రధాన కార్యదర్శి బొల్ల పద్మారావు, పాత్రికేయులు తూటి శ్రీనివాస్, ఆంకేన్ న్యూస్ ఛానెల్ సి ఈ ఓ అరుణ్ కుమార్ త్యాగి, సత్యనారాయణ పంబోజు గంగాధర్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News