- శ్రీకాంత్ యాదవ్
రసాయనాలతో హోలీ ఆడవద్దని, సహజరంగులే ముద్దని, ఆనందోత్సవాల మధ్య ప్రజలు పండుగను జరుపుకోవాలని గ్రేటర్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన హోలీ పర్వదినం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
పవిత్రమైన ఈ పండుగను శాంతి, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లో ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రసాయన రంగులు ఆరోగ్యానికి హానికరమని, చర్మ సమస్యలు తలెత్తే అవకాశముందని చెప్పారు. అందువల్ల పర్యావరణహితమైన సహజ రంగులతో, సాంప్రదాయ పద్ధతుల్లో హోలీ వేడుకలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
హోలీ పండుగ ఆనందానికి ప్రతీక అని, ఎలాంటి అనుచిత ఘటనలు చోటు చేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
