కాప్రా డివిజన్(Kapra Division)లోని శ్రీసాయిశివనగర్ కాలనీ అభివృద్ధి(Development)కి అన్ని విధాలా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Bandari Laxma Reddy) అన్నారు. ఆ కాలనీలో రూ.90 లక్షలతో చేపట్టిన రోడ్డు పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి తమ కాలనీకి రోడ్డులేక నరకయాతన పడుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యే.. రోడ్డు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ (BRS) కాప్రా డివిజన్ అధ్యక్షుడు బైరీ నవీన్ గౌడ్, కాలనీ వాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
