Wednesday, March 4, 2026
HomeతెలంగాణKishan Reddy | మరోవిధంగా సాయం చేస్తాం….

Kishan Reddy | మరోవిధంగా సాయం చేస్తాం….

  • మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేం
  • వరంగల్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం
  • వేగంగా మామునూరు విమానాశ్రయ నిర్మాణం
  • ముందుగా ఏటీఆర్ విమానాలు నడుపుతాం
  • చురుకుగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు
  • అమృత్ పథకం కింద వరంగల్కు రూ.874 కోట్లు
  • వరంగల్ పర్యటనలో మీడియాతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

వరంగల్ విమానాశ్రయం నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నిర్ణయించామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. ఇక్కడి నుంచి ముందుగా ఏటీఆర్ విమానాలు నడపాలని భావిస్తున్నట్లు తెలిపారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి శనివారం వరంగల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత పౌరుల స్పందన బట్టి మరిన్ని సర్వీసులు నడుపుతాం అన్నారు.. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. అమృత్ పథకం కింద వరంగల్ జిల్లాకు రూ.874 కోట్లు మంజూరయ్యాయి. కాజీపేట రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పామని అన్నారు.

హృదయ్ పథకం కింద పురాతన ఆలయాల పునరుద్ధరణకు కేంద్రం నిధులు ఇచ్చింది. రామప్ప ఆలయం అభివృద్ధి కోసం కేంద్రం రూ.146 కోట్లు ఖర్చు చేస్తోందని కిషన్రెడ్డి వివరించారు. బిసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్కి చిత్తశుద్ది లేదని కిషన్రెడ్డి విమర్శలు చేశారు. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పూర్తి బాధ్యత అని.. ఈ విషయంలో ఆ పార్టీది కపటనాటకమని ఎద్దేవా చేశారు. బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ మాత్రమే అని స్పష్టం చేశారు. రిజర్వేషన్లపై బీఆర్ఎస్కు మాట్లాడే నైతికత లేదని ఆక్షేపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు బీసీలకే కేటాయిస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహించాయని మండిపడ్డారు. బీసీలకు ఇచ్చే సీట్లలో ముస్లింలు పోటీచేసే అవకాశం ఉందని.. ఇది బీసీలకు అన్యాయం చేసినట్లు కాదా…? అని ప్రశ్నించారు. మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని స్పష్టం చేశారు కిషన్రెడ్డి. మామునూరు ఎయిర్పోర్ట్కు సంబంధించిన భూసేకరణ చివరి దశలో ఉందని చెప్పుకొచ్చారు. ఎయిర్పోర్ట్ విషయంపై కొంతమంది రైతులు కోర్టుకెళ్లారని..

తాము చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎయిర్లైన్స్ కంపెనీలతో తాము మాట్లాడుతున్నామని వివరించారు. ఎయిర్పోర్ట్లు కట్టడమే కేంద్రం బాధ్యత అని.. విమానాలు నడిపేది ప్రైవేటు కంపెనీలేనని తెలిపారు. హైదరాబాద్ నుంచి పరిశ్రమలు పోతే మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడతారని.. ఈ విషయంపై తాము పోరాడుతున్నామని చెప్పుకొచ్చారు. పరిశ్రమలపై సీఎం రేవంత్రెడ్డి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కిషన్రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News