Wednesday, February 11, 2026
Homeరంగారెడ్డిAccident | రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Accident | రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

మేడ్చల్ పోలీస్ స్టేషన్ రిధిలో రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని పాదచారి మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం సుమారు 12:15 గంటల సమయంలో, ఎన్హెచ్-44పై మెడ్చల్ చెక్పోస్ట్ వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంక్ ముందు ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అతివేగంతో నిర్లక్ష్యంగా నడిపిన గుర్తు తెలియని కారు, రోడ్డును దాటుతున్న సుమారు 50-51 సంవత్సరాల వయస్సు గల పాదచారిని ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ ఆగకుండా పారిపోయాడు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వ్యర్థ పదార్థాలను సేకరిస్తూ జీవనోపాధి పొందేవాడిగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News