నిర్మల్ జిల్లా కేంద్రంలో ’99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శనను ఛైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పుస్తక ప్రియులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు ఈ ప్రదర్శన ఎంతో దోహదపడుతుందన్నారు. నిరుద్యోగులు గ్రంథాలయాల్లోని వనరులను సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
- Advertisement -
