బ్యాంకుల్లోని అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు అక్టోబర్ నెలలో రూ.760 కోట్లు తగ్గాయి. ఈ విషయాన్ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ (RBI Deputy Governor) శిరీష్ చంద్ర ముర్ము (Sirish Chandra Murmu) వెల్లడించారు. బ్యాంకుల్లోని అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించడానికి కేంద్ర బ్యాంకు ఇటీవల ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో భారీగా ఫలితాలు వచ్చాయి. అంతకుముందు ప్రతి నెలా యావరేజ్‌గా 100 నుంచి 150 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు మాత్రమే సెటిల్ అయ్యేవి. దీంతో పోల్చితే పరిస్థితి చాలా మెరుగైనట్లు చెప్పొచ్చు. క్లెయిమ్ చేయని డిపాజిట్లను ట్రాక్ చేసి నిజమైన యజమానులకు తిరిగి ఇవ్వడానికి బ్యాంకులను ప్రోత్సహించే పథకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ప్రారంభించింది.
దీని ఫలితంగా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ (DEA) ఫండ్ నుంచి సుమారు రూ.760 కోట్లు తగ్గాయి. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్-గేట్‌వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్(Udgam-ఉద్గమ్) పోర్టల్‌ను మెరుగుపరచాలని చూస్తున్నారు. తద్వారా మరింత యూజర్-ఫ్రెండ్లీగా మలచనున్నారు. RBI సెప్టెంబర్‌లో యాక్సలరేటెడ్ పేఔట్-ఇనాపరేటివ్ అకౌంట్స్, అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్‌లను సులభతరం చేసే పథకాన్ని ప్రారంభించింది. ఇది.. 2025 అక్టోబర్ నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఏడాదిపాటు కొనసాగుతుంది. చట్టబద్ధమైన హక్కుదారులకు డబ్బు తిరిగి రావడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల స్టాక్‌ను తగ్గిస్తుంది. DEA ఫండ్‌కు తాజా ప్రవాహాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.
