Wednesday, March 18, 2026
Homeభక్తిUgadi | ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి..

Ugadi | ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి..

  • ఈ ఉగాదికి శుభాలు అందుకోండి..

ఉగాది నాడు ధరించాల్సిన శుభరంగులు.. ఆకుపచ్చ: ప్రకృతికి ప్రతీక అయిన ఈ రంగు కొత్త ఆరంభాలు, అభివృద్ధిని సూచిస్తుంది. ఆకుపచ్చ దుస్తులు ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. పసుపు: మంగళకరమైన రంగు. పూజలలో పసుపు ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ఈ రంగు సంపద, ఆరోగ్యం, ఆనందాన్ని సూచిస్తుంది. ఉగాది నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం ఎంతో శుభప్రదం. ఎరుపు: శక్తి, ఉత్సాహానికి సంకేతం.

ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల ఉత్సాహం పెరిగి, రోజంతా ఉల్లాసంగా గడుస్తుంది. తెలుపు లేదా క్రీమ్: ప్రశాంతత, పవిత్రతకు సూచిక. కొత్త సంవత్సరాన్ని శాంతంగా ప్రారంభించాలని భావించే వారికి ఇవి సరైన ఎంపిక. కాషాయం: ఆధ్యాత్మికతకు ప్రతీక. దేవాలయ దర్శనాలు లేదా ఇంటి పూజల సమయంలో ఈ రంగు ధరించడం శుభప్రదంగా భావిస్తారు.

- Advertisement -

ఉగాది రోజున చేయాల్సిన ముఖ్యమైన పనులు.. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి దేవుడిని ఆరాధించాలి. ఇంటి ముందు ముగ్గు వేయడం శుభ సూచికం. గుమ్మానికి మామిడి ఆకులతో తొరణం కట్టాలి. బెల్లం, మామిడి, వేపపువ్వు, చింతపండు, మిరప, ఉప్పుతో ఉగాది పచ్చడి తయారు చేసి తినాలి. పూలు, పండ్లను దేవుడికి సమర్పించాలి.

పంచాంగ శ్రవణం చేయాలి. పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదం పొందాలి. పూజకు అనుకూల సమయం.. చైత్ర శుద్ధ పాడ్యమి మార్చి 18 రాత్రి 10:45కి ప్రారంభమై, మార్చి 19 రాత్రి 8:30 వరకు ఉంటుంది. పూజకు ఉత్తమ సమయం ఉదయం 6:15 నుంచి 8:45 వరకు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News