Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్Udbhav | ముగిసిన ఉద్భవ్-2025 వేడుకలు

Udbhav | ముగిసిన ఉద్భవ్-2025 వేడుకలు

కేఎల్ యూనివర్సిటీ(KL University)లో 3 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించిన ఉద్భవ్-2025 విజయవంతంగా ముగిసింది(Completed successfully). దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి 405 ఈఎంఆర్ స్కూళ్ల(EMR Schools)కు చెందిన 1800 మంది విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా సంప్రదాయ నాటిక, నృత్య, సంగీత పోటీలు నిర్వహించారు. 49 విభాగాలకు సంబంధించిన పోటీల ఫలితాలను వెల్లడించారు. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.

గిరిజన విద్యార్థుల (Tribal Students) కళా నైపుణ్యాలను, ప్రతిభను వెలికితీసి దేశవ్యాప్తంగా చాటి చెప్పాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 6వ జాతీయ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ సొసైటీ సంప్రదాయ, సంస్కృతీ కళా ఉత్సవం (ఉద్భవ్-2025) ముగింపు వేడుకలను విజయవాడ కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలోని కృష్ణ జింక ప్రధాన వేదికపై శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

- Advertisement -

ముఖ్య అతిధులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ, వికలాంగులు, సీనియర్ సిటిజన్ సంక్షేమం, సచివాలయం & గ్రామ వాలంటీర్ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక, సంస్కృతి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, గిరిజన సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు.

గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మల్లికార్జున నాయక్, ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి గౌతమీ, నెస్ట్ సహాయ కార్యదర్శి బిపిన్ రాటురి, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్మరన్ రాజ్, కేఎల్ యూనివర్సిటీ వీసీ ప్రొ.వెంకట్రామన్, ఎస్టీ కమిషన్ సభ్యులు మల్లేశ్వరరావు, కాకి లక్ష్మి, జిసీసీ నంబర్ కన్నమ రాజు, టీడీపీ ఎస్టీ సెల్ చైర్మన్ ఎం.ధారునాయక్, ఎన్ఈఎస్టీఎస్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఈఎంఆర్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News