Monday, February 9, 2026
Homeనల్లగొండTRP | బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా టీఆర్‌పీ పోరాటం.

TRP | బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా టీఆర్‌పీ పోరాటం.

  • కేసీఆర్ జైలు కు పంపకుండా ఉండేందుకు రూ.2000 కోట్ల డీల్.
  • మతి తప్పి మాట్లాడుతున్న మంత్రులు.
  • బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీల రాజ్యాధికారమే టీఆర్‌పీ లక్ష్యం.
  • వట్టె జానయ్య పై వందల కేసులు, జైలు భయాలు లెక్కచేయకుండా పోరాటం : ఎమ్మెల్సీ మల్లన్న
  • ఫిబ్రవరి 11 మున్సిపల్ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేయాలి.
  • ఆప్ కీ బార్… బీసీ సర్కార్’ నినాదాలతో సభ ముగింపు.
  • ఎమ్మెల్సీ టి ఆర్ పి పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న.

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంప్రమైజ్ రాజకీయాలు నడుస్తున్నాయని, రెడ్డి–వెలమ వర్గాలు కలిసి పాలిస్తున్నాయని ఆరోపించారు.ఆదివారం సూర్యాపేట జిల్లాలు కేంద్రంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం, మున్సిపాలిటీ ఎన్నికల సభ సందర్భంగా ఆయన సూర్యాపేట పట్టణంలోని ఎస్ వి కలశాల వద్ద నుండి జిల్లా (టిఆర్పి) కార్యాలయం వరకు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్ళారు.

అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ తో కలిసి జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సూర్యాపేట నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలపై బెదిరింపులు, ఒత్తిళ్లు కొనసాగిస్తున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితుల్లో సూర్యాపేట పట్టణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.

- Advertisement -

సూర్యాపేటలో నిర్వహించిన టీఆర్‌పీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో బీసీలు రాజకీయంగా అణచివేయబడుతున్నారని, వారి రాజ్యాధికారమే టీఆర్‌పీ లక్ష్యమని స్పష్టం చేశారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ టీఆర్‌పీ అని తెలిపారు. రాష్ట్రంలో వందల కేసులు, జైలు శిక్షలు ఎదుర్కొన్నా వెనకడుగు వేయకుండా పోరాడిన నాయకుడు తానేనని మల్లన్న పేర్కొన్నారు.

బీసీల పక్షాన నిలబడి అగ్రవర్ణ రాజకీయాలకు ఎదురుగా నిలిచినందుకే తనపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకోవడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. రెడ్డి లేని శాసనమండలి సభ్యుల ఎన్నిక చరిత్రగా నిలిచిందన్నారు.

కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు అవకాశాలు తగ్గించారని ఆరోపించారు బీసీలు ఇకపై అగ్రకుల నాయకుల గడపల వద్ద సీట్ల కోసం వేడుకోకూడదని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాలనలో సూర్యాపేట జిల్లాలో కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు.ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో కీలకమైనవని, బీసీల భవిష్యత్తు ఈ ఎన్నికలతో ముడిపడి ఉందని అన్నారు. ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి టీఆర్‌పీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ సభలో పార్టీ జిల్లా నాయకులు, ఆపార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News