Friday, October 3, 2025
ePaper
HomeతెలంగాణTrinetra Foundation | రైతులకు బ్యాటరీ స్ప్రేయర్లు, మట్టి పరీక్షా కిట్లు

Trinetra Foundation | రైతులకు బ్యాటరీ స్ప్రేయర్లు, మట్టి పరీక్షా కిట్లు

  • 100 మంది రైతులకు బ్యాటరీ స్ప్రేయర్లు మరియు మట్టి పరీక్షా కిట్లు పంపిణీ చేశారు
  • స్ప్రేయర్‌ వినియోగం, మట్టి పరీక్ష విధానం, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు
  • త్రినేత్ర ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు బాల్‌రాజ్‌ నూనె,త్రినేత్ర ఫౌండేషన్‌ సహ వ్యవస్థాపకురాలు భారతి మరియు తదితరులు.

సిద్ధిపేట జిల్లా కోమురవెల్లి మండలం కిష్టంపేట గ్రామంలోని బిబిఆర్‌ ఫార్మ్స్‌ వద్ద రైతుల సంక్షేమానికి కార్యక్రమం నిర్వహించారు. షెడ్యూల్డ్‌ కులాల ఉప ప్రణాళిక కింద ఐసిఏఆర్‌ – ఐఐఆర్‌ఆర్‌ (భారత వరి పరిశోధనా సంస్థ, వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం) మరియు త్రినేత్ర ఫౌండేషన్‌ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మంది రైతులకు బ్యాటరీ స్ప్రేయర్లు మరియు మట్టి పరీక్షా కిట్లు పంపిణీ చేశారు.

ప్రతి కిట్‌లో బ్యాటరీతో నడిచే స్ప్రేయర్‌ యంత్రం, మట్టి పరీక్షా కిట్‌ లు ఉన్నాయి. శాస్త్రవేత్తలు ప్రత్యక్ష శిక్షణ ఇచ్చి, స్ప్రేయర్‌ వినియోగం, మట్టి పరీక్ష విధానం, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఉత్సాహంగా పాల్గొని ప్రదర్శనలో భాగమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్‌ బీజేపీ కోఆర్డినేటర్‌ (తెలంగాణ), ఎస్‌ఏఆర్‌ఏఎల్‌ నేషనల్‌ ఇన్‌ఛార్జ్‌, త్రినేత్ర ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు బాల్‌రాజ్‌ నూనె, త్రినేత్ర ఫౌండేషన్‌ సహ వ్యవస్థాపకురాలు భారతి, పిఎల్‌బీ ఎస్‌సీఎస్‌పి, ఐసిఏఆర్‌ – ఐఐఆర్‌ఆర్‌. ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డా. జేయకుమార్‌, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌, మట్టి శాస్త్రం, ఐసిఏఆర్‌ – ఐఐఆర్‌ఆర్‌ డా. బ్రజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా భారతి మాట్లాడుతూ.. మహిళా రైతులు సాంకేతికతలో చురుకుగా పాల్గొనడం గర్వకారణం. ఈ కిట్లు మహిళలకు సౌలభ్యం మాత్రమే కాక, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి అని అభిప్రాయపడ్డారు. బాల్‌రాజ్‌ నూనె మాట్లాడుతూ.. ఈ పంపిణీ కార్యక్రమం కేవలం సహాయం కాదు, ఇది ‘సేవ హీ సంఘటన్‌’ భావజాలానికి ప్రతిబింబం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సేవా పఖ్వాడా జరుగుతోంది. సేవ ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మకం.

రైతు ఉన్నతంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. సరిహద్దుల కోసం జవాను ఎంత ముఖ్యుడో, గ్రామం కోసం రైతు అంతే ముఖ్యుడు. అందుకే నేను ఇక్కడ ‘జై జవాన్‌, జై కిసాన్‌’ అన్నప్పుడు రైతులు గళం కలిపి ప్రతిధ్వనించారు. అది స్ఫూర్తిదాయక క్షణం. ఈ కిట్లు కేవలం పనిముట్టులు కాదు %-% ఇవి మార్పు సాధనాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘వికసిత్‌ భారత్‌’ స్వప్నంలో ఇవి చిన్న కానీ బలమైన అడుగులు’’ అని పేర్కొన్నారు. పంపిణీ పొందిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ‘‘ఇలాంటి అవసరమైన సహాయం మాకు ఇంతవరకు ఎవరూ అందించలేదు. ఈరోజు అందించిన కిట్లు నిజంగా మా జీవితాల్లో మార్పు తీసుకువస్తాయి’’ అని కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News