Tuesday, March 3, 2026
Homeహైదరాబాద్‌Practice | విజయం సాధించే వరకు.. విశ్రమించకూడదు..

Practice | విజయం సాధించే వరకు.. విశ్రమించకూడదు..

జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్

జవహర్ నగర్, జనవరి 30(ఆదాబ్ హైదరాబాద్): మనిషి తన లక్ష్య సాధనలో విజయం(Victory) సాధించే వరకు(Practice untill win) నిరంతరం సాధన చేస్తూనే ఉండాలని జవహర్ నగర్(Jawahar Nagar) మాజీ డిప్యూటీ మేయర్(Former Deputy Mayor) రెడ్డి శెట్టి శ్రీనివాస్ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి(Mahatma Gandhi Vardhanti) సందర్భంగా శుక్రవారం పాపయ్య నగర్ కాలనీలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యాగ్రహమే బాపూజీ ఆయుధమని, అహింసను బోధించారని తెలిపారు. ఆంగ్లేయుల పాలన నుంచి మన దేశానికి స్వాతంత్రం సాధించిపెట్టిన అగ్రగణ్యుల్లో గాంధీజీ ముందు వరుసలో నిలిచారని చెప్పారు. ప్రజలు ఆయన్ని మహాత్ముడిగా, జాతిపితగా గౌరవిస్తారని పేర్కొన్నారు.

సత్యం, అహింస గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలని, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన ప్రధాన ఆయుధాలని వివరించారు. కొళాయి కట్టి, చేత కర్ర బట్టి, నూలు వడికి, మురికివాడలను శుభ్రం చేస్తూ అందరూ ఒక్కటే అనే సందేశాన్ని చాటి చెప్పిన మహానుభావుడని కొనియాడారు. అహింసా మార్గంలో కోట్లాది మందిని ఒక్కతాటిపై నడిపించి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ధీరుడని అన్నారు.

గాంధీజీ సిద్ధాంతాల్లో మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం, పేదరిక నిర్మూలన వంటి ఆశయాలను సాకారం చేసేందుకు జవహర్ నగర్ ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలు ముదిరాజ్, భారతి, మల్లేష్, మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, విజయ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News