బెంగళూరులోని ఐఏఎఫ్ ప్రధాన కార్యాలయంలో నిర్వహణ
దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీకి ‘ప్రైడ్ ఆఫ్ ది ట్రైనింగ్ కమాండ్’ ట్రోఫీ
వైమానిక దళ శిక్షణ కమాండర్ల (TRAINING COMMAND COMMANDERS CONFERENCE-2025) వార్షిక సమావేశం-2025 బెంగళూరులోని ఐఏఎఫ్ (IAF) ప్రధాన కార్యాలయంలో ఈ నెల 23, 24 తేదీల్లో జరిగింది. వైమానిక దళాధిపతి(CAS) ఎయిర్ చీఫ్ మార్షల్ (Air Chief Marshal) ఏపీ సింగ్ (AP Singh) అధ్యక్షత వహించారు. అన్ని శిక్షణా సంస్థల కమాండర్లు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. శిక్షణా తత్వశాస్త్రంలో తీసుకురావాల్సిన పరివర్తన, మౌలిక సదుపాయాల ఆధునీకరణ, భారత వైమానిక దళ కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా బోధనా పద్ధతుల అమరిక వంటి విస్తృతాంశాలపై చర్చలు జరిగాయి.

ఈ సమావేశంలో CAS అన్ని శిక్షణా సంస్థల పనితీరును సమీక్షించారు. గణనీయమైన విజయాలను ప్రశంసించారు. మెరుగుపర్చాల్సిన కీలక రంగాలను గుర్తించారు. ప్రపంచవ్యాప్త ముప్పులు, సాంకేతికతలను ఎదుర్కొంటూ రక్షణ దళాలు సమర్థవంతమైన పోరాటానికి సిద్ధంగా ఉండేలా చూసుకోవడానికి సైనిక శిక్షణలో పరివర్తనలు చాలా ముఖ్యమైనవని నొక్కి చెప్పారు. కార్యకలాపాలు, నిర్వహణ, పరిపాలనలో అత్యుత్తమ విజయాలను గుర్తించి ట్రోఫీలను ప్రదానం చేశారు. ‘ప్రైడ్ ఆఫ్ ది ట్రైనింగ్ కమాండ్’ ట్రోఫీని దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ(Air Force Academy, Dundigal)కి ప్రదానం చేశారు.


