శిక్షణా తరగతుల్లో జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ వెల్లడి
సుప్రీంకోర్ట్ మీడియేషన్ అండ్ కన్సిలేషన్ ప్రాజెక్టు కమిటీ(Supreme Court Mediation and Conciliation Project Committee), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(Andhra Pradesh State Legal Services Authority) ఆదేశాల మేరకు లాయర్లకి మధ్యవర్తిత్వం అనే అంశంపై శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. ఇవి విజయవాడ కోర్ట్ ప్రాంగణంలో ఈ నెల 23 వరకు జరుగుతాయి. వీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 35 మంది లాయర్లకు Concept and Techniques of Mediation అనే అంశంపై తరగతులను నిర్వహిస్తున్నారు.
ఈ తరగతులను తమిళనాడు హైకోర్ట్ న్యాయవాదులు, సీనియర్ ట్రైనర్స్ R.విజయకమల, సత్యారావు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ.. కక్షిదారులకు తక్కవ ఖర్చుతో, తక్కువ సమయంలో త్వరితగతిన పరిష్కారం అందించటం కోసం సుప్రీంకోర్ట్ మీడియేషన్ అనే అంశాన్ని ప్రవేశపెటిందని చెప్పారు. ఇందులో భాగంగానే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 35 మంది న్యాయవాదులకు రెండో దశలో శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. Mediationలో కేసుల సెటిల్మెంట్ విషయంలో లాయర్లదే ప్రముఖ పాత్ర అని, అందుకే న్యాయవాదులకు శిక్షణా కార్యక్రమం చేపట్టారమని పేర్కొన్నారు. న్యాయవాదులందరూ కేసుల పరిష్కారం విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి మాట్లాడుతూ గత రెండేళ్లలో ఇది 6వ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని వెల్లడించారు. మొదటి రెండు ప్రోగ్రామ్స్ క్లస్టర్ డిస్ట్రిక్ట్స్ అయిన కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల న్యాయమూర్తులకు, 3వ ప్రోగ్రామ్‌లో కృష్ణా జిల్లా న్యాయమూర్తులకు, 4, 5 ప్రోగ్రామ్స్‌లో న్యాయ వాదులకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 64 మంది ట్రైన్డ్ అడ్వొకేట్ మీడియేటర్స్ ఉన్నారని, ఈ రెండో దశలో మరో 35 మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. APSLSA సభ్య కార్యదర్శి BSV హిమబిందు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఈ దశలో మరో 400 మంది న్యాయవాదులకు శిక్షణ తరగతులు చెబుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి, APSLSA సభ్య కార్యదర్శి బి.ఎస్.వి.హిమబిందు, IIవ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి A.సత్యానంద్, DLSA కార్యదర్శి K.V.రామకృష్ణయ్య, డిప్యుటీ సెక్రటరి APSLSA అమర రంగేశ్వరరావు, ఇతర న్యాయమూర్తులు, బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు. అందరూ ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని అనేక కేసులను సత్వరం పరిష్కరించే దిశలో అడుగులు వేయాలని వక్తలు సూచించారు.
