Tuesday, February 24, 2026
Homeహైదరాబాద్‌Awareness | వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలి

Awareness | వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలి

  • హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలి-ట్రాఫిక్ పోలీసుల అవగాహన

సికింద్రాబాద్ పరిధిలోని మెట్టుగూడ ఆలుగడ్డ బావి ప్రధాన రోడ్డు కూడలి వద్ద చిలకలగూడ ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ జగన్ రెడ్డి,ఆధ్వర్యంలో వాహనదారులకు ‘అరైవ్–అలైవ్’ ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం లో భాగంగా సుమారు 50 మందికి ట్రాఫిక్ పై అవగాహన నిర్వహించారు.ఈ అవగాహన కార్యక్రమానికి ట్రాఫిక్ ఏసీపీ ఏ.శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు భద్రతలో భాగంగా టూ వీలర్ పై ప్రయాణించే వాహనదారులు అదేవిధంగా ఎనకవైపు సీట్లు కూర్చున్న వ్యక్తులు సైతం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.అదేవిధంగా కారులో ప్రయాణించే వారందరూ సీటు బెల్టు పెట్టుకోవాలని, ముందున్న వాహనాన్ని దాటేసేందుకు ఎట్టి పరిస్థితిలో డ్రైవర్ కు ఎడమవైపుగా వెళ్లకూడదని వెళ్లినట్లయితే ప్రమాదాలు ఎదురవుతాయని సూచించారు.

- Advertisement -

ముందు వైపు వెళుతున్న ఏదైనా వాహనాన్ని ఓవర్‌టేక్ కుడివైపు నుంచే చేయాలని అవగాహన కల్పించారు.కార్యక్రమంలో చిలకలగూడ ట్రాఫిక్ ఎస్‌.ఐ.శ్రీధర్,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News