నిజామాబాద్‌లో సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్ పట్టణంలో శ్రీమతి సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సావిత్రిబాయి పూలే దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆమె ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
- Advertisement -

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు, స్థానిక ఎమ్మెల్యే ధనపాల్ సూర్య, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్‌బిన్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, బీసీ సంఘం నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -
