Friday, March 6, 2026
Homeక్రైమ్ వార్తలుIBOMMA | బొమ్మ పడింది

IBOMMA | బొమ్మ పడింది

రవితోనే ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను షట్ డౌన్ చేయించిన పోలీసులు

  • వందల కోట్లకు పడగలెత్తిన ఇమ్మడి రవి.!.
  • ఏళ్లుగా టాలీవుడ్ను కుదిపేసిన మాఫియా
  • ఫ్రాన్స్ నుంచి రాగానే పట్టుకున్న పోలీసులు
  • పోలీసులకే సవాల్ విసిరిన పైరసీ కింగ్ పిన్
  • రూ.3 కోట్ల నగదు, వందల కొద్దీ హార్డ్ డిస్క్లు
  • కస్టడీ కోసం నాంపల్లి కోర్టుకు ఇమ్మడి రవి..

తెలుగు సినీ పరిశ్రమకు గత అనేక సంవత్సరాలుగా భయానక ప్రమాదంగా మారిన పైరసీ కార్యకలాపాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు కఠిన చర్యలు చేపట్టారు. కోట్లాది రూపాయల బడ్జెట్తో తీసిన సినిమాలు గంటల వ్యవధిలోనే ఐబొమ్మ, ఒప్పం టీవీ వంటి వెబ్సైట్లలో ప్రత్యక్షమవుతూ నిర్మాతల రక్తం పీల్చిన ఈ నెట్వర్క్ మొదటిసారిగా పూర్తిగా నిషేధించారు సైబర్ క్రైమ్ అధికారులు. ఈ రెండు వెబ్సైట్లను నిర్వహించిన ఇమ్మడి రవిని శనివారం అరెస్ట్ చేసిన వెంటనే, అతడి సమక్షంలోనే సైట్లను ఒక్కొక్కటిగా క్లోజ్ చేసి పూర్తిగా డౌన్ చేయించారు. ఈ చర్యతో టాలీవుడ్ను ముంచెత్తిన అతిపెద్ద పైరసీ దందా మొదటిసారి వెలుగు లోకి వచ్చినట్లయింది.

- Advertisement -

ఇమ్మడి రవి అరెస్టు సంచలనం కావడానికి కారణం ఇటీవలే సోషల్ మీడియాలో అతడు సైబర్ అధికారులకు చేసిన సవాల్. అతను సైబర్ క్రైమ్ వ్యవస్థనే సవాల్ చేయటం వైరల్గా మారింది అనధికారిక పైరసీ ద్వారా సొంతం చేసుకున్న “కోట్లాదిమంది వ్యక్తిగత డేటా” తన వద్ద ఉందని, ఈ వెబ్సైట్ను టార్గెట్ చేయడం ఆపేయాలని పోలీసులకు మెయిల్ రూపంలో విసిరిన ఆ హెచ్చరికను సైబర్ క్రైమ్శఖ సీసెరిఔస్ గా తీసుకుంది గతంలో కూడా ఈ ముఠా చర్యలను అడ్డుకునేందుకు అధికారులు అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ, విదేశాల్లో ఉన్న సర్వర్లు, మారిపోతూ ఉన్న డొమెయిన్లు, ప్రాక్సీల జోలికే వెళు న్న మోసపూరిత మార్గాల వల్ల నిందితులు పూర్తిగా పట్టుబట్టడం కష్టమైపోయింది.

కానీ ఈసారి వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ రవి విసిరిన సవాల్తో అధికారులు డైరెక్ట్ గా రంగం లోకి దిగారు గతంలో తెలుగు సినీ పరిశ్రమ పైరసీ కారణంగా ఎన్నోసార్లు నష్టాలను చవిచూసింది. ‘సైరా’, ‘అల వైకుంఠపురములో’, ‘ఖైదీ’, ‘పుష్ప’ వంటి భారీ సినిమాలు థియేటర్లలో విడుదలైన గంటలోపే లీకయ్యాయి. నిర్మాతల మండలి పలుమార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నా, సమస్యను పూర్తిగా పరిష్కరించే దిశలో గట్టి చర్యలు అప్పటివరకు కనిపించలేదు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, గోవా వంటి కేంద్రాల్లో రైడ్లు చేసినా చిన్నపాటి అప్లోడ్ లింకులు, మిర్రర్ సైట్లు మాత్రమే అధికారుల చేతిలో పట్టుబడ్డాయి. కానీ అసలు నెట్వరన్ను కంట్రోల్ చేస్తున్న మాస్టర్మైండ్పై చర్య తీసుకునే ఇప్పటిదాకా దొరకలేదు. ఇప్పుడు, ఇమ్మడి రవి అరెస్ట్లో ఈ పరిస్థితి కీలక మలుపు తిరిగింది. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్క్లు, SSD డ్రైవ్లు, క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్లు, డొమెయిన్ రిజిస్ట్రేషన్లు, రహస్య లాగిన్లు అన్నింటిని పోలీసులు ఒకేసారి సీజ్ చేశారు.

ఫోరెన్సిక్ లాబ్కు పంపిన ఈ స్టోరేజ్ డివైసుల్లో కొత్త సినిమాల కాపీలు ఎలా చేరాయి, వాటిని ఎక్కడ నుంచి తీసుకున్నారు, దేశమంతటా ఎలా పంపిణీ చేశారు, ఇతర దేశాల్లో ఉన్న సహచరులతో ఎలా నెట్వర్క్ సమకూర్చుకున్నారు? ఇవన్నీ తెలుసుకునేందుకు విచారణ పూర్తిస్థాయిలో కొనసాగుతోంది. రవికి చెందిన బ్యాంక్ ఖాతాల్లో గత నాలుగేళు గా జరిగిన అనుమానాస్పద లావాదేవీలను కూడా సైబర్ క్రైమ్ అధికారులు ఒక్కో లేయర్గా విడదీస్తున్నారు.

ఈ ఖాతాల్లోకి వచ్చిన డబ్బు కేవలం ప్రకటన ఆదాయం మాత్రమేనా? లేదా పైరసీ సినిమాలను ప్రత్యేకంగా అమ్మే రహస్య టెలిగ్రామ్ ఛానల్ల నుంచి వచ్చిన డబ్బా? అన్నకోణం లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో, రవిని కస్టడీలోకి తీసుకుని మరింత సమాచారం రాబట్టేందుకు సైబర్ క్రైమ్ శాఖ సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ కేసు విచారణలో ఇతర రాష్ట్రాల సైబర్ పోలీసులతో కూడా సమన్వయం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఐబొమ్మ, బప్పం టీవీ వంటి సైట్లలో హిందీ, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలూ పెద్ద సంఖ్యలో కనిపించేవి.

అంతేకాదు సర్వర్లు సింగపూర్, నెదర్లాండ్స్, రష్యా, లాట్వియా వంటి దేశాల్లో కూడా వీరి కార్యకలాపాలు ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే అనుమానిస్తున్నారు. ఈ దేశాల నుంచి సమాచారం తెప్పించడానికి అంతర్జాతీయ సైబర్ సహకారం అవసరం. తెలుగు పరిశ్రమలో ఇది గత పది ఏళ్లలో జరిగిన పెద్ద పైరసీ అణచివేత చర్యగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యజమానులుఅందరూ ఈ చర్యను స్వాగతిస్తూ సోషల్ మీడియాలో అధికారుల చర్యలను ప్రశంసిస్తున్నారు.

సంవత్సరాలుగా పరిశ్రమను చెల్లాచెదరు చేసిన ఈ అక్రమ వెబ్సైట్లను శాశ్వతం గా నిషేధించటం, రవిని అరెస్ట్ చేయడం, ఈ క్రమంలో చోటు చోటుచేసుకుంటున్న చర్యలు పరిశ్రమవర్గాల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. సినిమాను రక్షించుకోవటానికి ఇది మొదటి అడుగని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు .మొత్తం మీద, ఇమ్మడి రవి అరెస్టుతో ప్రారంభమైన ఈ దర్యాప్తు దేశవ్యాప్తంగా ఉన్న పైరసీ నెట్వర్ను పూర్తిగా ఒడిసిపట్టే స్థాయికి చేరుతుందా? టాలీవుడ్ పరిశ్రమ ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన నిర్ణయాత్మక చర్య ఇదేనా? అన్న ప్రశ్నలకు త్వరలోనే సమాధానం రానుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News