- పౌర సరఫరాల శాఖ డిటీ మాచన రఘునందన్ కు అత్యున్నత గౌరవం
అతని కృషి భారత దేశ పొగాకు నియంత్రణ లోనే అరుదైనది. తన తపన సమాజ హితం కావాలి అనుకున్నాడు..కానీ ఆ అసాధారణ తపస్సు ఓ ఉన్నత స్థాయి అవార్డు కు తనను చేరువ చేస్తుంది అని ఏ నాడు అనుకోలేదు.ఐనా కానీ “చరిత్ర సృష్టించాడు”.
మాచన రఘునందన్ ఓ సాధారణ ఉద్యోగి.పౌర సరఫరాల శాఖ లో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ గా విధులు నిర్వహిస్తారు.
పొగాకు ధూమపానం తో సమాజం ఎలా ప్రభావితం అవుతుందో నిత్యం చూస్తూ.. తట్టుకోలేక..సార్..నో స్మోకింగ్ ప్లీజ్” అంటూ..అర్థించాడు,ప్రార్థించాడు.





ఓ పిచ్చి వాడిలా..ప్రతి ఒక్కరినీ సిగరెట్ మానేయండి సార్ అని అడిగారు.ఆత్మీయుడిగా ఎంతో మంది హృదయాల్లో స్థానంసంపాదించాడు.ఉండటానికి 22 ఏళ్ళ తర్వాత ఆ కృషి ఫలించింది.పొగాకు నియంత్రణ లో ఉద్దండులను ఆలోచింపజేసింది.ఇతన్నిఅతని కృషి,పట్టుదల అలుపెరగని పోరాటం ఫలితంగా జాతీయ స్థాయిలో ఓ అత్యున్నత అవార్డు అతన్ని వరించింది. యావత్ భారతం అవాక్కయింది. మిస్టర్ మాచన రఘునందన్ ద టుబాకో కంట్రోల్ “హీరో” అని పేర్కొంది.ఓ వ్యక్తి హీరో ఎలా అయ్యారు, అంతర్జాతీయ స్థాయిలో ఎందరో టుబాకో కంట్రోల్ హీరో ల తో సరిసమానంగా చేరాడు..అని చెప్పడానికి ఓ అంతర్జాతీయ సంస్థ రఘునందన్ గురించి ఎంతో సమయాన్ని వెచ్చించి, ఓ వైద్యేతరుడు వైద్యుల కన్నా మిన్న గా చరిత్ర సృష్టించాడు అని హీరో అవార్డు ప్రదానంచేసింది.యావత్ భారతం లో టొబాకో కంట్రోల్ హీరో అవార్డ్ దక్కడం అంత ఆషా మాషి కాదు. “హి ఈజ్ ఎక్స్ట్రార్డినరీ” అతని కృషి అసాధారణం అని సెలెక్షన్ కమిటి వ్యాఖ్యానించింది అంటే..ఓ సామాన్యుడు తన అసామాన్య కృషి తో సాధించిన నిస్వార్థ సేవా ఫలితం.
కొందరు తమ కష్టంతో చరిత్రలో నిలుస్తారు. కానీ, నిశ్శబ్దంగా,ఎటువంటి హడావుడి లేకుండా సమాజానికి సేవ చేసే నిజమైన హీరోలు చాలా అరుదు.అలాంటి అరుదైన వ్యక్తిత్వం, ధూమపానం మరియు పొగాకు నియంత్రణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మాచన రఘునందన్. ఒక ఉద్యోగి గా..డిప్యూటీ తాసిల్దార్‌గా నౌకరీ చేస్తున్న వ్యక్తి విలాసవంతమైన జీవితాన్ని కాదని, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించడం దేశ చరిత్ర లో నే ప్రథమం.ఒక అసాధారణ నాయకుడు రఘునందన్.
వైద్య వృత్తికి సంబంధం లేకపోయినా, పొగాకు నియంత్రణ కోసం 22 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆయన కృషిని అంతర్జాతీయ వేదిక రిసోర్స్ సెంటర్ ఫర్ టొబాకో కంట్రోల్ (ఆర్ సి టి సి)గుర్తించి,ఆయనకు దేశం లో పొగాకు నియంత్రణ లో నే అత్యున్నత స్థాయి గౌరవం ఇచ్చింది. “హీరో” అవార్డును ప్రదానం చేసింది. ఇది కేవలం ఒక వ్యక్తికి లభించిన గౌరవం కాదు, ఇది నిస్వార్థ సేవకు, అంకితభావానికి, మరియు సమాజం పట్ల ఉన్న బాధ్యతకు లభించిన గుర్తింపు.
సాధారణంగా, ఈ అవార్డు వైద్యులకు మాత్రమే లభిస్తుంది. కానీ, రఘునందన్ తన నిస్వార్థ సేవతో, ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 15 మంది లో “మాచన” మాత్రమే వైద్యేతరుడు, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తి.
మాచన రఘునందన్ అనే పేరు ఇకపై ఒక అధికారి పేరు మాత్రమే కాదు, పొగాకు మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక విప్లవ వీరుడి పేరు. ఆయన పొందిన “హీరో” అవార్డు కేవలం ఒక బహుమతి కాదు, నిస్వార్థ సేవకు లభించిన కిరీటం. ఆయన జీవితం, రేపటి తరం కోసం ఒక ఆదర్శం, ప్రేరణ.
రఘునందన్ సృష్టించిన ఈ “నిశ్శబ్ద విప్లవం” భవిష్యత్ తరాలకు ఒక ప్రేరణగా నిలుస్తుంది. ఆయన చేసిన సేవలు, మన చుట్టూ ఉన్న సమాజాన్ని మంచిగా మార్చడానికి మనలో ప్రతి ఒక్కరూ ఎలా కృషి చేయాలో తెలియజేస్తాయి. రఘునందన్ వంటి నిజమైన హీరోలు సమాజంలో ఉన్నంత కాలం, ఆశ, స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. ఆయన కృషికి, అంకితభావానికి మనం ఎంత ప్రశంసించినా తక్కువే