Friday, October 3, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్TTD | ధ్వజారోహణంతో తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం

TTD | ధ్వజారోహణంతో తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్శంచిన చంద్రబాబు

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ధ్వజారోహణం వైభవంగా జరిగింది. బుధవారం సాయంత్రం మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాత్రి తొమ్మిది గంటలకు నిర్వహించే పెద్దశేష వాహన సేవతో బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి ధర్మకర్తల మండలి హయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు తితిదే సిద్ధమైంది.

ఉత్సవాలను పురస్కరించుకుని సీఎం చంద్రబాబు దంపతులు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాల్రు సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ బుధవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా గాయత్రి అతిథి గృహం వద్ద చంద్రబాబు, లోకేశ్‌కు తితిదే చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ స్వాగతం పలికారు. 25న ఉదయం 9.10కి వెంకటాద్రి నిలయానికి చేరుకుని ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ తదితరాలను ప్రారంభిస్తారు. 9.50 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. అనంతరం 10.40కి తిరుగు ప్రయాణమవుతారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News