నులి పురుగుల (Worms) సమస్యతో బాధపడేవాళ్లు మందులు (Medicines) వాడటంతోపాటు కొన్ని టిప్స్ (Tips) పాటించాలి. రోజూ వెల్లుల్లి (Garlic) తిన్నా సరిపోతుంది. గుమ్మడి కాయ (Pumpkin) విత్తనాలను తీసుకున్నా బెటరే. బొప్పాయి (Papaya) పండ్లు తిన్నా ఉపశమనం పొందొచ్చు. కొబ్బరి నూనె (Coconut Oil) వాడటం ద్వారా కూడా ఈ ఇబ్బందిని తప్పించుకోవచ్చు. ఈ నూనెను రాత్రి పూట పడుకోబోయే ముందు ఒక టీ స్పూన్ (Tea Spoon) మోతాదులో తాగితే చాలు. మలబద్ధకం (Constipation) తొలిగిపోతుంది. జీర్ణ వ్యవస్థ (Digestive System) బాగా పనిచేస్తుంది. వాల్ నట్స్, అల్లం రసం సైతం పరిష్కార మార్గాలే. బీన్స్, కూరగాయలు, ఆకు కూరలు తినాలి. పెరుగు, క్యారెట్లు, బీట్‌రూట్‌లను తిని సమస్య నుంచి బయటపడొచ్చు.
