పుట్టగానే అమ్మ (Mother) ఒడి తొలి బడి(School)గా మారినా.. జీవితం చెప్పే పాఠాలు (Lessons) మాత్రం కాలానికే సాధ్యం. నాన్న (Father) వేలు పట్టి ఎంత నడిపించినా.. జీవితంలో వేసిన తప్పటడుగులకు సరైన సమాధానమే (Answer) కాలం. ఎదిగే కొద్ది ఎవరికీ చెప్పుకోలేని ఎన్నో బాధలను సృష్టించే వింత నేస్తం (Friend) కాలం. ప్రతి ఒక్కరి జీవితానికి తప్పొప్పులను నేర్పే కార్యక్షేత్రం కాలం. ప్రతి మనిషి జీవిత చరిత్ర(Biography)ను రాసే అరుదైన రచయిత(Writer)కు నిదర్శనం కాలం.
మరపురాని గొప్ప కథనాలను లిఖించే స్నేహమే కాలం. మరువలేని విషాదాలను మిగిల్చే ఓదార్పు కాలం. బడిలో ఎన్నో పాఠాలు విన్నా ఎప్పుడూ వినని జీవిత పాఠాలు నేర్పే నైజం కాలానికే సొంతం. ఆదరిస్తే అందలాన్ని అందించే అదృష్టమే (Luck) కాలం. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా అథ:పాతాళానికి తొక్కే రాక్షసత్వమే కాలం. నిశితంగా ప్రతిదీ గమనించేలా చేయడమే కాలానికి ఉన్న గొప్ప గుణం. సమస్యలు ఎన్ని ఎదురైనా వాటి అంతం చూసేవారికి వదలని ధైర్యమే కాలం. నిర్లక్ష్యం అనే నీడను చేరకుండా శ్రమించడం నీకు తెలిసినప్పుడు కాలం నీ వెంట నడవడం తథ్యం.
సహనం నీకు ఆస్తి అయితే దేన్నైనా సాధించే దిశగా నిన్ను ప్రోత్సహించడం కాలానికి ఉన్న అరుదైన లక్షణం. జీవితంలో ప్రతిదీ నేర్పే గొప్ప గుణపాఠాల గురువుకు చిహ్నం కాలం. నీకు తెలియకుండా నిన్ను నిరంతరం వెంబడించే అదృశ్య శక్తికి మరో రూపం కాలం. సరైన మార్గంలో వినియోగించుకుంటే ప్రతి విజయం నీ పాదాక్రాంతం అనేది కాలం చెప్పే తారకమంత్రం.
- వంశీకృష్ణ గౌడ్ బండి
