- బరువు తగ్గేవారికి అమృతం..
ఉదయం అల్పాహారం రోజంతా శక్తి, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇక భారతీయ ఇళ్లలో సాధారణంగా కనిపించే రెండు ప్రముఖ వంటకాలు థెప్లా, పరాఠా. ఇవి రెండూ రుచికరమైనవే కాకుండా సులభంగా తయారు చేయవచ్చు. అయితే బరువు తగ్గాలని భావిస్తున్నప్పుడు వీటిలో ఏది మంచి ఎంపిక అన్నది తెలుసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు దేనిని తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. థెప్లా ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే, ఇది తక్కువ క్యాలరీలతో ఉండే అల్పాహారం.
సాధారణంగా ఒక థెప్లాలో సుమారు 120 క్యాలరీలు మాత్రమే ఉంటాయి, అందువల్ల ఇది తేలికపాటి ఆహారంగా పరిగణించబడుతుంది. గోధుమ పిండితో తయారు చేయడం వల్ల నెమ్మదిగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లను అందించి ఉదయం ఆకలిని నియంత్రిస్తుంది. మెంతి ఆకులు కలిపి తయారు చేసే మేథీ థెప్లా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా, దీన్ని తక్కువ నూనెతో తయారు చేయవచ్చు కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి అనుకూలం. ప్రయాణాల్లో కూడా సులభంగా తీసుకెళ్లగలిగే ఈ వంటకం పరిమాణాన్ని నియంత్రించడం కూడా సులభం.
అయితే బరువు తగ్గడంలో ఏది మంచిదన్న ప్రశ్నకు సమాధానం వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. తేలికగా, తక్కువ క్యాలరీలతో ఉండే ఆహారం కావాలంటే థెప్లా మెరుగైన ఎంపిక. కానీ ఎక్కువసేపు తృప్తినిచ్చే, శక్తినిచ్చే అల్పాహారం కావాలంటే పరాఠాను కూడా ఆరోగ్యకరంగా తయారు చేసి తీసుకోవచ్చు. ఈ రెండింటినీ ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి కొన్ని సూచనలు ఉన్నాయి.
