- ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్
- ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.4.50 లక్షల ఎల్.ఓ.సీలు పంపిణీ
సికింద్రాబాద్ శాసనసభ్యులు,మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ పేద రోగులకు వైద్య సేవలు అందించడంలో తమ సేవ దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు.సికింద్రాబాద్ నియోజకవర్గంలోని నామాలగుండు,అడ్డగుట్ట, చిలకలగూడ,మెట్టుగూడ ప్రాంతాలకు చెందిన నలుగురు రోగులు అస్వస్థతతో సీతాఫలమండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆశ్రయించగా,వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్.ఓ.సీ పత్రాలు అందించారు.
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు సరస్వతికి రూ.50 వేలు,నయీం ఖాన్ ఖాద్రికి రూ.1.50 లక్షలు,అన్నగాని వెంకటయ్యకు రూ.1 లక్ష, మహమ్మద్ సనా ఉల్లా ఖాన్‌కు రూ.1.50 లక్షల చొప్పున మొత్తం రూ.4.50 లక్షల విలువైన ఎల్.ఓ.సీలు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు వైద్య సహాయం అందించడంలో ఎప్పుడూ ముందుంటామని తెలిపారు.నియోజకవర్గ ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి సీతాఫలమండిలోని క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
