Wednesday, February 11, 2026
HomeజాతీయంParliament | పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం

Parliament | పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Winter Session) ప్రారంభమయ్యాయి. ఇటీవల చనిపోయిన ఎంపీలకు లోక్‌సభ (Lok Sabha) సంతాపం తెలిపింది. వన్డే వరల్డ్ కప్ (One Day World Cup) గెలిచిన ఉమెన్ టీమిండియా (Women Team India) సభ్యులకు అభినందనలు చెప్పారు. అనంతరం ప్రశ్నోత్తరాలు చేపట్టగా ప్రతిపక్షాలు (Opposition) ఆందోళన చేపట్టాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)పై చర్చకు పట్టుబట్టాయి. జాతీయ భద్రతపైన, కార్మిక కోడ్‌లపైన చర్చించాలని కోరాయి. కానీ.. ప్రభుత్వం హామీ ఇవ్వలేదు.

ఈ నేపథ్యంలో సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమయ్యాక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో రెండు బిల్లులు పెట్టారు. పొగాకు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలా తయారీపై కొత్త పన్ను విధించేలా ఈ బిల్లులను రూపొందించారు. మరోవైపు.. రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కొత్త చైర్మన్‌(Chairman)గా బాధ్యతలు చేపట్టిన సీపీ రాధాకృష్ణన్‌(CP Radha Krishnan)కు స్వాగతం పలికారు. మొట్టమొదటిసారి సభా కార్యకలాపాలు ప్రారంభించిన ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News