తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల రేటు పెరుగుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఏమాత్రం నిజం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. అవాస్తవాలతో భక్తులను తప్పుదోవపట్టించడం సరికాదని అన్నారు. టీటీడీతోపాటు ఏపీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఇలాంటి అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలను వండి వార్చేవారిపై చట్టపరంగా చర్యలు చేపడతామని హెచ్చరించారు. లడ్డూ ప్రసాదాల ధరలను పెంచాలనే ఆలోచనేదీ లేదని తేల్చిచెప్పారు.
- Advertisment -
