Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌R.Krishnaiah | బీసీ రిజర్వేషన్ల బాధ్యత ప్రభుత్వానిదే

R.Krishnaiah | బీసీ రిజర్వేషన్ల బాధ్యత ప్రభుత్వానిదే

హైదరాబాద్ న్యాయ సాధన దీక్షలో ఆర్.కృష్ణయ్య
ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌లో దీక్షకు నేతృత్వం

ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌లో ఆదివారం జరిగిన ‘BC రిజర్వేషన్ల న్యాయ సాధన దీక్ష’(Nyaya Sadhana Dheeksha)కు BC సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జాతీయ BC సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు R.కృష్ణయ్య నేతృత్వం వహించారు. విద్యార్థి, యువజన, మహిళ, ఉద్యోగ, న్యాయవాదులు సహా 60కిపైగా BC సంఘాలు పాల్గొన్నాయి.

- Advertisement -

సభలో R.కృష్ణయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో BC కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం తక్కువగా ఉందని చెప్పారు. ప్రభుత్వం ఖచ్చితమైన జనాభా లెక్కలు సమర్పిస్తే 42% రిజర్వేషన్ న్యాయపరంగా సాధ్యమేనని తెలిపారు. కోర్టులు కూడా సమగ్ర డేటా ఆధారంగా రిజర్వేషన్ పెంపును పరిశీలిస్తాయని అన్నారు.

దీక్షకు అధ్యక్షత వహించిన BC కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రామాణిక పద్ధతులు పాటిస్తే 42% మాత్రమే కాదు, 52% రిజర్వేషన్లు కూడా అమలుచేయొచ్చని పేర్కొన్నారు. ‘డేటా బలంగా ఉంటే చట్టపరమైన అవరోధాలు తగ్గుతాయి’ అని వెల్లడించారు.

హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ పెంపును అమలుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉందని గుర్తుచేశారు. BRS పార్టీ MLC ఎల్.రమణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.

దీక్ష సమయంలో ఇందిరా పార్క్ బీసీ రిజర్వేషన్ల నినాదాలతో మార్మోగింది. వేలాది మంది BC సంఘాల కార్యకర్తలు తరలిరావటంతో ధర్నా ప్రాంగణం కిక్కిరిసింది. BCల జనాభా, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతిష్టాత్మక వేదికల్లో తగిన శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌ను నేతలు పునరుద్ఘాటించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News