కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమాను రాష్ట్రంలో ప్రవేశపెట్టకుండా అరిగోస
నల్లగొండ కలెక్టరేట్ వద్ద రైతు దీక్షకు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంఘీభావం
బీజేపీ రాష్ట్ర పార్టీ (Bjp State Party) పిలుపు మేరకు నల్లగొండ (Nalgonda) కలెక్టరేట్ (Collectorate) వద్ద బీజేపీ కిసాన్ మోర్చా (Kisan Morcha) ఆధ్వర్యంలో 24 గంటలపాటు చేపట్టిన రైతు నిరాహార దీక్ష (Farmer’s hunger strike) కార్యక్రమానికి బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Yeleti Maheshwar Reddy) సంఘీభావం తెలిపారు. అనంతరం నాయకులతో దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కి రైతులను మోసం చేస్తూ పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు వరంగల్ డిక్లరేషన్‌లో చేసిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించిన పంట అకాల వర్షాలతో చేతికి రాకుండా పోవడం బాధాకరం అన్నారు. పంట నష్ట పోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వడంలేదని, కనీసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన అమలుపరిస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలుచేయకుండా రైతులను ఈ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు.
