కరీంనగర్, నవంబర్ 16 (ఆదాబ్ హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రం(Telangana State)లోని జర్నలిస్టుల (Journalists) ఐక్యతకు ప్రాధాన్యం ఇస్తామని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (Working Journalists of India-WJI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కరీంనగర్ సప్తగిరి కాలనీలో డబ్ల్యూజేఐ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల సాధనే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.
జాతీయ స్థాయిలో 17 రాష్ట్రాల్లో కార్యకలపాలు కొనసాగిస్తున్న డబ్ల్యూజేఐ.. తెలంగాణలో బలమైన శక్తిగా రూపుదిద్దుకుంటోందన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం సంఘం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని తెలిపారు. కొన్ని యాజమాన్యాలు జర్నలిస్టులకు వేతనాలు (Salaries) ఇవ్వడం లేదన్న విషయంపై లేబర్ కమిషన్ (Labor Commission) అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
ఓ వైపున యూనియన్ నిర్మాణం కోసం కృషి చేస్తూనే మరో వైపున జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న ఘనత డబ్ల్యూజేఐకే దక్కిందని వివరించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, అనిల్ దేశాయ్, కార్యదర్శి శివనాథుని ప్రమోద్ కుమార్, కార్యవర్గ సభ్యుడు టి.సత్యనారాయణ పాల్గొన్నారు.
బీఎంఎస్ (BMS) అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ కరీంనగర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఏర్పాటైంది.
అధ్యక్షుడు: దారం జగన్నాథరెడ్డి(భారత శక్తి)
ఉపాధ్యక్షులు: మొగురం రమేష్(ఎడిటర్, తెలంగాణ తేజ) నర్సరీ కేదారి(ప్రజాస్థానం దినపత్రిక)
ప్రధాన కార్యదర్శి: గుడాల శ్రీనివాస్(దిశ)
మహిళా కార్యదర్శులు: వేముల సుమ(బతుకమ్మ టీవీ), లావణ్య
ఆర్గనైజింగ్ కార్యదర్శులు: రవీందర్(ప్రజాసాక్షి), జి.రమేష్(బీఆర్కే న్యూస్)
సంయుక్త కార్యదర్శులు: కీసర సదానంద్(మన తెలంగాణ), డీఎస్ ప్రసాద్ (ఎడిటర్, తెలంగాణ న్యూస్), బూర్ల వెంకటేష్(ప్రజాసాక్షి)
కోశాధికారి: చిట్టిమల్ల మహేందర్
కార్యవర్గ సభ్యులు: కృష్ణ హరి (తెలుగు ప్రభ), అనుగు శ్రీనివాసరెడ్డి, జి.రామకృష్ణ(విజయక్రాంతి), కంది శ్రీనివాసరెడ్డి(వార్త), పి.సంతోష్ గౌడ్(ఆంధ్రప్రభ), జాలి నరేష్, కస్తూరి ప్రభాకర్(డెస్క్), ఆకుల సంజీవరావు, గంగం రాజు(ఉదయం), కె.రవీంద్ర చారి(జనత), ఎండీ రహీముద్దీన్(స్కై లైన్), సీహెచ్ వెంకటేష్(నవ జ్యోతి), కె.కుమార్(జనం న్యూస్)
