Thursday, March 5, 2026
Homeసాహిత్యంRural India | కనుమరుగవుతున్న కట్టెల పొయ్యి

Rural India | కనుమరుగవుతున్న కట్టెల పొయ్యి

మన దేశంలో కట్టెల పొయ్యి (Wood Stove) మీద వంట చేయడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ వంట పద్ధతి (Traditional Cooking Method). కట్టెలు/పేడ తదితర బయోమాస్‌(Biomass)ను ఇంధనంగా ఉపయోగించి పొయ్యి వెలిగిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ పద్ధతి విస్తృతంగా వ్యాప్తిలో ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక ఇళ్లలో ఇప్పటికీ కట్టెలపొయ్యినే ఉపయోగిస్తారు. పట్టణ ప్రాంతం(Town Areas)లో మాత్రం కొంత శాతం మేరకు వేడి నీళ్లు కాగబెట్టడం లేదా పండుగల సమయంలో పిండి వంటలు చేయడం వంటి పనులకు కట్టెలపొయ్యిని ఉపయోగిస్తారు.

ట్టెలను సేకరించడం, నిల్వ చేయడం:

- Advertisement -

ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో గుట్టకు వెళ్లి కట్టెలు కొట్టుకొని వస్తారు. దగ్గరలోని అడవుల నుంచి కట్టెలను సేకరిస్తారు. కొన్నేళ్ల కిందట వరకూ ఇలా సేకరించిన కట్టెలను దగ్గరలోని పట్టణాలకు ఎడ్ల బండ్లు/సైకిళ్ల మీద అమ్మకానికి తెచ్చేవారు. ఇళ్లలో కట్టెలను నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా చిన్న గది/షెడ్ లాంటి ఏర్పాటు ఉండేది. వీటిని కట్టెలర్ర అనీ పిలిచేవారు. అయితే.. మారుతున్న జీవనశైలితో ఇపుడు కట్టెల పొయ్యిపై వంట చేయడం చాలా వరకూ తగ్గింది. చాలా ఇళ్లలో ఇపుడు ఈ కట్టెలర్రలు స్టోర్ రూమ్‌లుగా మారాయి.

కట్టెల పొయ్యి రకాలు:

మూడు రాళ్లను త్రిభుజాకారంలో ఉంచి కట్టెలతో మండించడం ఎప్పటినుంచో ఉన్న పద్ధతి. అంతేగాక.. మట్టితో చేసిన పొయ్యిలను సాంప్రదాయంగా ఉపయోగిస్తారు. సిమెంట్‌తో చేసినవి, ఇనుప రేకులతో తయారైనవి, రెడీమేడ్ పొయ్యిలు కూడా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇపుడు వీటిల్లో నో స్మోక్ పొయ్యిలు కూడా వస్తున్నాయి. పొగను తగ్గించి, మంటను సమర్థవంతంగా నిర్వహించేలా వీటిని రూపొందించారు. ప్రస్తుతం మెటాలిక్ ఇంప్రూవ్డ్ కుకింగ్ స్టవ్‌లు విస్తృతంగా ఉపయోగంలోకి వస్తున్నాయి. ఇంధన వినియోగాన్ని, పొగను తగ్గించేందుకు, వంట సామర్థ్యాన్ని పెంచేందుకు వీటిని రూపొందించారు. ఇవి ఇంధన వినియోగాన్ని 33.85% మేరకు, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 60.93% మేరకు తగ్గిస్తాయి.

కట్టెలపొయ్యి పై వంట చేయడం

ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వంట పద్దతి అయినప్పటికీ.. కట్టెల పొయ్యిపై వంట చేయడం నిజానికి శ్రమతో కూడిన పని. గొట్టం ద్వారా నోటితో గాలిని ఊదుతూ మంటను నిరంతరం సరిచేస్తూ వంట చేయాలి. ఇది మహిళలకు కష్టతరమైంది. పొగ వల్ల వారికి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే.. ఇంప్రూవ్డ్ బయోమాస్ కుక్‌స్టవ్‌లు థర్మల్ ఎఫిషియన్సీని 30% వరకు పెంచుతాయి. పొగ ఉద్గారాలను తగ్గిస్తాయి.

ప్రస్తుత వినియోగం

మారుతున్న జీవనశైలితో ఇప్పుడు ఎక్కువగా ఎల్‌పీజీ స్టవ్‌లు సౌకర్యవంతంగా మారాయి. అయినా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిలు ఇప్పటికీ ప్రబలంగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో మాత్రం పండుగల సమయంలో ప్రత్యేక వంటల కోసం, వేడి నీళ్లు కాగబెట్టడం వంటి పనులకు ఇవి ఎక్కువగా ఉపయోగిస్తారు. 2025లో దేశ ఉడ్ హీటింగ్ స్టవ్‌ల మార్కెట్ యూఎస్డి 533.8 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. 6.8% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్(సీఏజీఆర్)తో పెరుగుతుంది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని సుప్రసిద్ధ 5 నక్షత్రాల హోటళ్లలో కట్టెల పొయ్యిపై చేసిన ప్రత్యేక వంటలకు మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇందులో వచ్చే రుచి ప్రత్యేకమైంది.

అయితే.. ఇళ్లలో కూడా కట్టెల పొయ్యిపై చేసిన వంటలు ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి అనే విశ్వాసం ఎప్పటికీ ఉంటుంది. అదే సమయంలో సాంస్కృతిక విలువలను కాపాడబతాయి అనే భావన కూడా ఉంది. పొగ వల్ల ముఖ్యంగా మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పొగ తదితర కాలుష్యాలు శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి. పర్యావరణంపై ప్రభావం గురించి చెప్పాలంటే అడవులకు నష్టం, కార్బన్ ఉద్గారాలు పెరుగుతాయని చెప్పొచ్చు.

  • అశోక్ గుంటుక
- Advertisement -
RELATED ARTICLES

Latest News