- నెరవేరనున్న గన్నేరువరం వాసుల చిరకాల వాంఛ
- వేములవాడ-సిరికొండ రోడ్డు నిర్మాణానికి రూ.23 కోట్ల మంజూరు
- కాళ్లరిగేలా తిరిగి అలసిన ఆ ప్రాంత ప్రజలకు కేంద్ర మంత్రి తీపి కబురు అందించిన బండి సంజయ్ కుమార్
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గన్నేరువరం-కొత్తపల్లి, వేములవాడ- సిరికొండ, ఆర్నకొండ-మల్యాల ఈ మూడు ప్రాంతాల ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఊహించని తీపి కబురు తీసుకొచ్చారు. అదేమిటంటే గన్నేరువరం ప్రజల చిరకాల వాంఛ అయిన మానేరు నదిపై హైలెవెల్వం వంతెనను నిర్మించేందుకు కేంద్రాన్ని ఒప్పించి రూ.77 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు. అట్లాగే చొప్పదండి నియోజకవర్గంలోని ఆర్నకొండ గ్రామం నుండి మల్యాల క్రాస్ రోడ్డు వరకు డబుల్ లేన్ విస్తరణ పనుల కోసం రూ.50 కోట్ల నిధులను మంజూరు చేయించారు. దీంతోపాటు వేములవాడ నుండి సిరికొండ వరకు రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.23 కోట్ల నిధులకు ఆమోద ముద్ర వేయించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 41236 కి.మీల మేరకు 34 ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ రూ.868 కోట్ల నిధులను మంజూరు చేసింది.
ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆ నిధులను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర రహదారుల మౌలిక సదుపాయల నిధి(సీఆర్ ఐఎఫ్) కింద తెలంగాణకు మంజూరైన మొత్తం రూ.868 కోట్ల నిధుల్లో ఏకంగా రూ.150 కోట్లు ఒక్క కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికే కేటాయిం చారు. మానేరు నదిపై హైలెవల్ వంతెనను నిర్మించాలనేది గన్నేరువాసుల చిరకాల వాంఛ. దీనికోసం గన్నేరువరం మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దశాబ్దన్నర కాలంగా పోరాడుతూనే ఉన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నారు. ఐక్య కార్యాచరణ సమితి పేరుతో మండల ప్రజలంతా ధర్నాలు, రాస్తారోకోలు, బంద్ లుసహా అనేక ఉద్యమాలు నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం పలుమార్లు కేంద్ర
మంత్రిని కలిసి విజప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించేలా చేశారు. కేంద్రం వద్దకు ప్రతిపాదనలు రాగానే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని, ఆ శాఖ ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి గన్నేరు వరం ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చాలని కోరారు. సానుకూలంగా స్పందించిన గడ్కరీ తాజాగా ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ నిధులు మంజూరు చేశారు. చొప్పదండి నియోజకవర్గంలోని ఆర్నకొండ గ్రామం నుండి మల్యాల క్రాస్ రోడ్డు వరకు దాదాపు 35 కి.మీల మేరకు రోడ్డు ఏమాత్రం బాగోలేదు. సింగిల్ రోడ్డు కావడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఈ రోడ్డు విస్తరణ చేపట్టాలని కోరుతూ స్థానిక ప్రజలు అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. అనేక రూపాల్లో వినతులు, నిరసనలు, ఆందోళనలు చేసినా గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతోపాటు నియోజకవర్గ బీజేపీ నాయకులు పలుమార్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసి ఈ విషయాన్ని ప్రస్తావించారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ కుమార్ ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపించారు. సానుకూలంగా స్పందించిన కేంద్రం తాజాగా ఆర్నకొండ నుండి మల్యాల క్రాస్ రోడ్డు వరకు డబుల్ లేన్ రోడ్డు విస్తరణ పనులకు సీఆర్ఎఎఫ్ పథకంలో భాగంగా రూ.50 కోట్లు మంజూరు చేసింది. చొప్పదండి నియోజకవర్గంలోని దాదాపుగా 15 గ్రామాల ప్రజలకు ఈ రోడ్డు విస్తరణవల్ల ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వేములవాడ నుండి సిరికొండ వరకు దాదాపు 76 కి.మీల ప్రయాణం. ఇందులో వేములవాడ నుండి దాదాపు 18.2 కి.మీల మేరకు రోడ్డును నిర్మించాలనేది ఈ ప్రాంత ప్రజల 20 ఏళ్ల కల. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల నుండి ఈ
డిమాండ్ వస్తూనే ఉంది. వివిధ రూపాల్లో ఆందోళనలు చేసి అలసిపోయారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ నియోజకవర్గంలోని రోడ్ల విస్తరణ, నిర్మాణ పనులకు సంబంధించి అనేక ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపారు. సానుకూలంగా స్పందించిన గడ్కరీ రూ.23 కోట్ల నిధులను మంజూరు చేయడం గమనార్హం. ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే కరీంనగర్ నుంచి నిజామాబాదు జిల్లాకు వెళ్లేందుకు దగ్గరి మార్గం కానుంది.
కరీంనగర్ పార్లమెంట్ ప్రజల రుణం తీర్చుకుంటా :కేంద్ర మంత్రి బండి సంజయ్
గన్నేరువరం -కొత్తపల్లి వరకు మానేరుపై హైలెవల్ వంతెన నిర్మాణంతోపాటు, వేములవాడ-సిరికొండ, ఆర్నకొండ- మల్యాల రోడ్డు విస్తరణ పనులకు ఆమోదం తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి గడ్కరీ, ఆ శాఖ ఉన్నతాధి కారులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీ తో గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజల రుణం తీర్చుకు నేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని తెలిపారు. రాజ కీయాలకు తావులేకుండా పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి అన్ని పార్టీల నేతలను కలుపుకుపోతున్నానని పేర్కొన్నారు. అందు లో భాగంగా కేశవ పట్నం నుండి సైదాపూర్, కొడి మ్యాల నుండి గోవిందారం మీదుగా తాండ్రియాల, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ నుండి ముస్తాబాద్ మండలం బండలింగాపూర్