ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇప్పలగూడెంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మేనత్త కొండగొర్ల ఎల్లమ్మ(50)ను అదే గ్రామానికి చెందిన మేనల్లుడు కొండగొర్ల విజయ్ కుమార్ చంపేశాడు. మద్యం మత్తులో గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. జల్సాలు, మద్యానికి బానిసైన విజయ్ కుమార్ డబ్బులు ఇవ్వాలని మేనత్తను డిమాండ్ చేశాడు. నిరాకరించిన ఆమె ఆరుబయటకు వెళ్లగా రోడ్డుపై అతి కిరాతకంగా గొడ్డలితో హతమార్చాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఎల్లమ్మ మృతదేహాన్ని చూసి స్థానికులు నిర్ఘాంతపోయారు. నిందితుడు నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సీఐ ముత్యం రమేశ్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు సంఘటనా స్థలిని పరిశీలించారు. బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలను సేకరించారు.
మేనత్తను గొడ్డలితో నరికి చంపిన దుండగుడు
RELATED ARTICLES
- Advertisment -