Thursday, March 12, 2026
Homeవరంగల్‌BC Budget | బీ.సీ లకు 55వేల కోట్లు కెటాయించాలి.

BC Budget | బీ.సీ లకు 55వేల కోట్లు కెటాయించాలి.

  • కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి.
  • తాటిపాముల వెంకట రాములు (రాష్ట్ర అధ్యక్షులు బీసీ హక్కుల సాధన సమితి).

శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఎన్నో హామీలను ప్రకటించి ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని బీసీ హక్కుల రాష్ట్ర అధ్యక్షులు తాటిపాముల వెంకట్ రాములు అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయనందుకు నిరసనగా, ఈ బడ్జెట్లో బీసీలకు 55వేల కోట్లు కెటాయింపులు చేయాలనీ కోరుతూ వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో వెంకట్ రాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకటరాములు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం బీసీలకు బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఏర్పడ్డ తర్వాత గడిచిన రెండు సంవత్సరాలలో 20 వేల కోట్లు మాత్రమే కేటాయించి అందులో కేవలం 6000 కోట్లు మాత్రమే బీసీలకు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. అది కూడా ఇందిరమ్మ చీరలకు ఇందులో నుంచే 2500కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు.

- Advertisement -

గడచిన రెండు బడ్జెట్లలో తక్కువ కేటాయింపులు చేసినందుకు గాను, ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కలుపుకొని మొత్తం 55 వేల కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయింపులు చేయాలన్నారు. అంతేకాకుండా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా వివిధ సామాజిక తరగతులకు ఆర్థిక తోడ్పాటు కోసం ఈ నిధులను ఖర్చు చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. కానీ ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పి ఈ రిజర్వేషన్లను సాధించడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తేలేదన్నారు.

ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను వంచించడమేనని అన్నారు. ఇప్పటికైనా బీసీలు ఎడల చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా ప్రతి అంశాన్ని రాబోయే రెండున్నర సంవత్సరాలలో పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి సహాయ కార్యదర్శి చీకటి ప్రకాష్ లతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ,వినతి పత్రం అందించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి నాయకులు ఓదెల భద్రయ్య ఓదెల రవి అడ్డగట్ల యువరాజ్ రామగిరి రామస్వామి, గాజుల సుమలత, శారద కవిత సలేహా సుల్తానా జి రజిత రేష్మ అమరున్నిసా బేగం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News