Saturday, October 4, 2025
ePaper
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్‌లోని ఇండియన్లకు సంబంధించిన ఆ ప్రచారం తప్పు

ఇజ్రాయెల్‌లోని ఇండియన్లకు సంబంధించిన ఆ ప్రచారం తప్పు

స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

ఇజ్రాయెల్‌లోని ఇండియన్లు అక్కడి మన ఎంబసీలో పేర్లు నమోదుచేసుకొని భారత్‌కు రావాలంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఫైన్ లేదా కారాగార శిక్ష విధిస్తారనేది పూర్తిగా అబద్ధమని తెలిపింది. అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించింది.

సరైన సమాచారం కోసం ఎంబసీ అఫిషియల్ అప్డేట్‌లపైన ఆధారపడాలని పేర్కొంది. ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయుల పేర్ల నమోదు అనేది సంక్షోభ సమయాల్లో చేపడతారని తెలిపింది. అలా సేకరించిన సమాచారం ఆధారంగా వారికి అత్యవసర సమయాల్లో సహాయం చేస్తామని, సంక్షేమ పథకాలను, సౌకర్యాలను కల్పిస్తాని వివరించింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News