Monday, February 23, 2026
Homeరంగారెడ్డిThanks to GHMC | జీహెచ్ఎంసీ అధికారులకు ధన్యవాదాలు

Thanks to GHMC | జీహెచ్ఎంసీ అధికారులకు ధన్యవాదాలు

అక్రమ నిర్మాణాన్ని (Illegal Construction) సీజ్ చేసి న్యాయం ఇంకా బతికే ఉందని నిరూపించిన GHMC అధికారులకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రజా విజయం (Public Victory) అంటూ హర్షం వ్యక్తం చేశారు. మన్సూరాబాద్ డివిజన్‌లోని శ్రీరామ్ నగర్ కాలనీలో రాఘవేంద్ర హోటల్ ఎదురుగా జరిగిన అక్రమ నిర్మాణాన్ని GHMC అధికారులు ఈ రోజు సీజ్ చేశారు.

కార్పొరేటర్ (Corporator) లంచం (Bribe) తీసుకొని అక్రమ నిర్మాణానికి సహకరించి అధికారులను మభ్యపెడుతూ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా.. కాలనీవాళ్లు (Colony People) ఐకమత్యంగా పోరాడారు. ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే (Lb nagar Mla) దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి (Devireddy Sudheer Reddy) ఈ విషయాన్ని వివరించి సమస్యను తీర్చాలని కోరగా ఆయనతోపాటు డివిజన్ BRS పార్టీ నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేశారు.

- Advertisement -

ప్రజల కష్టాన్ని తీర్చే విషయంలో తాను ఎల్లప్పుడూ ముందే ఉంటానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరోసారి నిరూపించారని స్థానికులు పేర్కొన్నారు. కార్పొరేటర్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, కాలనీవాసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినా, ఎమ్మెల్యే పైన, డివిజన్ BRS పార్టీ నాయకుల పైన ఎన్ని నిందలు వేసినా, వెనకడుగు వేయకుండా, బెదరకుండా, కలిసి కట్టుగా పోరాడిన ప్రతి ఒక్కరికీ మన్సూరాబాద్ డివిజన్ బీఆర్ఎస్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇది మన్సూరాబాద్ డివిజన్ ప్రజల విజయమని, భవిష్యత్‌లోనూ ఇలాగే అక్రమాలను, అవినీతిని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News