Tuesday, February 10, 2026
HomeతెలంగాణAwareness | కెవైసీ మోసాలపై ఉద్యోగులకు అప్రమత్తంగా ఉండాలి..

Awareness | కెవైసీ మోసాలపై ఉద్యోగులకు అప్రమత్తంగా ఉండాలి..

  • హెచ్చరించిన ఆర్టీసీ విసి, ఎండీ వై.నాగిరెడ్డి, ఐపీఎస్..
  • కెవైసీ అప్డేడేట్ పై ఆర్బీఐ అవగాహన ప్రచార పోస్టర్ ఆవిష్కరణ..
  • ఆర్.టి.సి., ఆర్.బీ.ఐ. సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం..

ఆర్టీసీ సౌజన్యంతో ఆర్టీసీ బస్సులు, టికెట్లపై అవగాహన కల్పిస్తున్న ఆర్బీఐ బ్యాంకు ఖాతాదారులు తమ కెవైసీ వివరాలను సకాలంలో అప్డేట్ చేసుకోవాలని కోరుతూ ఆర్బీఐ రూపొందించిన ప్రజా అవగాహన ప్రచార పోస్టర్ ను సంస్థ వీసీ అండ్ ఎండీ వై.నాగిరెడ్డి, ఐ.పి.ఎస్. ఆవిష్కరించారు. సోమవారం బస్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్బీఐ అధికారులతో కలిసి ప్రచార పత్రాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..

ప్రతి ఒక్కరూ తమ కెవైసీ అప్ డేట్ చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఖాతాదారులలో ప్రతి ఒక్కరూ అప్డేట్ చేసుకోవడం ఎంతో అవససరమని, లావాదేవీలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయనే విషయాన్ని ఉద్యోగులు ఎప్పుడూ మరవకూడదన్నారు.

- Advertisement -

కె.వై.సి ప్రాధాన్యతను ఆర్బీఐ అధికారులు వివరిస్తూ.. ఆన్ లైన్, ఏటీఎం, బ్యాంక్ బిజినెస్ కరెస్పాండెంట్ లేదా బ్యాంకు శాఖ ద్వారా కెవైసీ అప్డేట్ చేసుకోవచ్చని సూచించారు..

ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు సమర్పించవచ్చని తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్, హైదరాబాద్ ఫిబ్రవరి 9 నుండి 13, 2026 వరకు “కె.వై.సి. – సురక్షిత బ్యాంకింగ్ కు మీ తొలి అడుగు” అనే థీమ్ తో ఆర్ధిక అక్షరాస్యత వారోత్సవాలు – 2026ను నిర్వహిస్తోందని వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమం ద్వారా కేవైసీ, సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ (సీకేవైసీ) గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, అలాగే ఖాతాల నిర్వహణలో క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం, కేవైసీకి సంబంధించిన మోసాలు, మనీ మ్యూల్ కార్యకలాపాల పట్ల అప్రమత్తత వంటి అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడం ఆర్టీఐ లక్ష్యమన్నారు.

కె.వై.సి ప్రచారానికి సంబంధించిన వివరాలు :

ఈ కార్యక్రమంలో భాగంగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ సహకారంతో, వారి విస్తృత ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించి ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందేశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతోంది. బస్సు టిక్కెట్ల వెనుక భాగంలో ఎఫ్.ఎల్.డబ్ల్యు. థీమ్ సందేశాలను ముద్రించడం ద్వారా రోజుకు సుమారు 20 లక్షల మంది ప్రయాణికులకు, వారం పాటు మొత్తం సుమారు 1.4 కోట్ల మందికి ఈ సందేశం చేరుతోంది. అదనంగా, సుమారు 120 టీజీఎస్ ఆర్.టి.సి. బస్సుల వెనుక భాగంలో ఎఫ్.ఎల్.డబ్ల్యు. (ఫైనాన్షియల్ లిటరసి వీక్) థీమ్ పోస్టర్లను ప్రదర్శించడం ద్వారా విస్తృత ప్రచారం, పునరావృత అవగాహన కల్పించబడుతోందని ఆర్బీఐ అధికారులు వెల్లడించారు.

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అర్భిఐ జనరల్ మేనేజర్ ముత్యాల జ్ఞాన సుప్రభాత్, అర్భిఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు యశ్వంత్ సాయి చిట్టెంశెట్టి, రాములు, సభావత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News