Tuesday, March 17, 2026
Homeరంగారెడ్డిNeera Cafe | నగరంలోని ప్రముఖ నీరాకేఫ్ నిర్వాహనకు టెండర్లు..!

Neera Cafe | నగరంలోని ప్రముఖ నీరాకేఫ్ నిర్వాహనకు టెండర్లు..!

  • బీసీ సంక్షేమ అధికారి : కేశురాం

గౌడ సామాజిక వర్గం నిర్వహించే నగరంలోని ప్రముఖ నీరా కేఫ్ రాబోయే రెండు సంవత్సరాలు నిర్వహించేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి కేషూరాం పేర్కొన్నారు. గీత కార్మిక సంఘాల నుండి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు కేశురాం తెలిపారు. 1000 రూపాయల డిడిని ఎండి టి ఓ ఓ డి టాపర్స్ సి ఓ ఓ పి ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ నీరా కేఫ్ పేర డిడి తీసి సమర్పించాలన్నారు.

అబ్కారీ శాఖ సర్టిఫికెట్, లైసెన్సు కుల ధ్రువీకరణ పత్రం తో పాటు ఐడి ప్రూఫ్, ఇ ఎమ్ డి రెండు లక్షలు ఇంకా సొసైటీ తీర్మానం చేసిన లెటర్ జత చేయాలని చెప్పారు. నేటి నుంచి ఈనెల 28 వరకు ఆసక్తి కలవారు బిడ్డలు పాల్గొనాలని, మరిన్ని వివరాలకు సమీపంలోని ఎక్సైజ్ కార్యాలయంలో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని కేసురాం తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News