నేస్తం ఫౌండేషన్ మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో అంగరంగ వైభవంగా నిర్వహించాయి. నిర్మాతలు సంస్థల అధ్యక్షులు మోహన్ గౌడ్ మరియు వీస్ విజయ్ వర్మ పాకలపాటి ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు మురళి మోహన్ , ఛాంబర్ సెక్రటరీ అశోక్ కుమార్ , నిర్మాతలు తమ్మా రెడ్డి భరద్వాజ , దామోదర్ ప్రసాద్, చదలవాడ శ్రీనివాస రావు లు ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకులు రేలంగి నరసింహ రావు, బి గోపాల్, నటీమణి రాశి లతో పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమ 24 శాఖలకు చెందిన సీనియర్స్ ని మురళి మోహన్ మరియు సినీ పెద్దలు సత్కరించారు.

ఛాంబర్ ప్రముఖులు మాట్లాడుతూ మోహన్ గౌడ్, విజయ్ వర్మ , వరప్రసాద్ లు గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుండడం గొప్ప విషయం, వచ్చే ఏడాది నుండి ఈ కార్యక్రమం చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో జరిగేలా ప్రణాళిక నిర్వహిస్తాం అన్నారు. మిమిక్రీ రమేష్ మరియు మనస్వి ల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా , సీనియర్ జర్నలిస్ట్ లు ట్రేడ్ గైడ్ వెంకటేశ్వర రావు , రెంటాల జయదేవ్ లను ప్రత్యేకంగా సత్కరించారు.


