Saturday, February 28, 2026
Homeకెరీర్ న్యూస్Inter Exams | ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎగ్జామ్స్ వద్దు..

Inter Exams | ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎగ్జామ్స్ వద్దు..

  • డైరెక్ట్ గా రెండవ ఏడుకు ప్రమోషన్ చెయ్యాలి..
  • తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక..

ఇంటర్‌ ఫస్టియర్‌లో పరీక్షలు పెట్టకుండా సెకండియర్‌కు ప్రమోట్‌ చేయాలని, సెకండియర్‌లోనే బోర్డు ఎగ్జామ్స్‌ నిర్వహించాలని, పాస్‌ మార్కులను 35 నుంచి 45 శాతానికి పెంచాలని తెలంగాణ విద్యాకమిషన్‌ ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్యవరకు సమగ్ర పాలసీ రూపకల్పనకు ఏర్పాటైన విద్యాకమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి, సభ్యులు గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి నివేదిక సమర్పించారు.

ఈ సందర్భంగా ఆకునూరి మురళి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 305 పాఠశాలలను సందర్శించామని, విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లతో 46 సమావేశాలు నిర్వహించి సమగ్రంగా నివేదికను తయారు చేశామని చెప్పారు. అనేక కీలక సిఫార్సులు చేసినట్టు తెలిపారు. తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వానికి నివేదించామని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News