Thursday, February 26, 2026
Homeకెరీర్ న్యూస్Intermediate | ప్రశాంతంగా ఇంటెర్మీడియేట్ పరీక్షలు..

Intermediate | ప్రశాంతంగా ఇంటెర్మీడియేట్ పరీక్షలు..

  • బుధవారం 9 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభం..
  • రేపటి నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభం..

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9 గంటలకు ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రేపట్నుంచి సెండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 1495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 9.97 లక్షల మంది పరీక్షలకు హాజరవుతున్నారు..

ఇంటర్ పరీక్షలకు హాల్ టికెట్‌ ఉంటేనే అనుమతిస్తున్నారు. వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లను పరీక్షకు అనుమతిస్తారు. హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్‌ సంతకం లేకపోయినా ఎంట్రీ ఉంటుంది. ఒక్క హాల్‌టికెట్‌ వెంట ఉంటే సరిపోతుంది. ఎలాంటి గుర్తింపు పత్రాలు అవసరంలేదు.

- Advertisement -

తాజాగా సమాధాన పత్రాల మూల్యాంకనం షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు ప్రకటించింది. మార్చి 4 నుంచి సంస్కృతం పేపర్ల మూల్యాంకనం ప్రారంభమవుతుంది. మార్చి 15నుంచి మొదటి విడత, మార్చి 18నుంచి రెండో విడత, మార్చి 20 నుంచి మూడో విడత మూల్యాంకనం ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌ రెండో వారంలో ఫలితాలు విడుదల చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News