Monday, February 16, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంIrregularities | సీఎం పర్యవేక్షిస్తున్న విద్యాశాఖలో ఆగని అక్రమాలు

Irregularities | సీఎం పర్యవేక్షిస్తున్న విద్యాశాఖలో ఆగని అక్రమాలు

  • ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో అసలు ఏం జరుగుతుంది..?
  • మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్న డిప్యూటేషన్ దందా..!
  • నిబంధనలు బేఖాతరు.. 11 సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ బోర్డులో తిష్టవేసిన అధికారిణి
  • కార్పోరేట్ కళాశాలలతో కుమ్మకైనట్లు అధికారిణిపై ఆరోపణలు వెల్లువెత్తున్నాయి..

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి మరియు కమీషనర్ కార్యాలయం (టీ.జీ.బి.ఐ.ఈ.) అక్రమాలకు అడ్డాగా మారుతోందా? నిబంధనలకు విరుద్ధంగా ఏళ్ల తరబడి ఒకే అధికారిణి చక్రం తిప్పుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?. అర్హత లేకపోయినా కీలక పదవులను కట్టబెట్టడం వెనుక ఉన్న రహస్యమేంటి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు విద్యాశాఖలో కలకలం రేపుతున్నాయి.

2004లో జూనియర్ లెక్చరర్గా ప్రస్థానాన్ని ప్రారంభించిన సదరు అధికారిణి, 2015లో డిప్యూటేషన్ పై ఇంటర్మీడియట్ బోర్డులో అడుగుపెట్టారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి నుంచి నేడు కీలకమైన జాయింట్ సెక్రటరీ వరకు ఆమె ప్రయాణం సాగింది. అయితే, ఈ పదోన్నతుల వెనుక భారీగా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

నిబంధనలు బేఖాతరు.. 11 సంవత్సరాలుగా
బోర్డులో తిష్టవేసిన అధికారిణి..!

జీవోలకు చెల్లుచీటి కార్పోరేట్ కళాశాలతో కుమ్మక్కు… కార్యదర్శి మరియు కమీషనర్ లు మారుతున్న ఆమె మాత్రం లోకల్..! ఎంత మంది బోర్డు కు కార్యదర్శి మరియు కమీషనర్ లు వచ్చిన ఆ ఆధికారిణి స్థానం చెక్కు చెదరదు

అర్హత సున్నా.. అధికారం మిన్న..

ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం, జాయింట్ సెక్రటరీ హోదాలో ఉండాలంటే కనీసం 8 సంవత్సరాలుగా ప్రిన్సిపాల్ అనుభవం ఉండాలి. కానీ, 2021లో ప్రిన్సిపాల్గా పదోన్నతి పొందిన కేవలం మూడు రోజులకే (వో.డీ. కింద చూపించి), నిబంధనలను తుంగలో తొక్కి ఆమెను జాయింట్ సెక్రటరీగా నియమించడం బోర్డులో చర్చనీయాంశంగా మారింది.

కార్పొరేట్ కళాశాలలతో ‘కుమ్మక్కు?

ఈ అధికారిణి, ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలకు ‘వారధి’గా వ్యవహరిస్తున్నారని చిన్న కళాశాలల యజమానులు ఆరోపిస్తున్నారు. కార్పొరేట్ కళాశాలలపై ఏదైనా ఫిర్యాదు వస్తే, అధికారులు రంగంలోకి దిగకముందే సమాచారం సదరు యాజమాన్యాలకు చేరుతోందని తెలుస్తోంది.

ఆర్.టీ.ఐ. కార్యకర్త ఫిర్యాదుపై నీళ్లు

గతంలో మన్సూరాబాద్లోని ఒక కార్పొరేట్ కళాశాల అనుమతులు లేకుండా నడుస్తోందని ఆర్.టీ.ఐ. కార్యకర్త మేకల వెంకట్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే, ఆ అధికారిణి అండదండలతో ఆ కళాశా లకు కేవలం నామమాత్రపు నోటీసులు, ఇచ్చి, పెనాల్టీలు వేశారు. కనీసం ఆ పెనాల్టీలు కూడా వసూలు చేయకుండానే ఆ కార్పొరేట్ కళాశాల కు ‘షిఫ్టింగ్ పర్మిషన్’ ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి.

జీ.వో.లకు చెల్లు చీటీ :

జీవో నెం. 2 (తేదీ: 02-01-2010) పేరా నెంబర్ 5 (ఱఱ) ప్రకారం.. మాతృశాఖలో పదోన్నతి పొందిన ఉద్యోగి, తమ ప్రొబేషన్ పీరియడ్ పూర్తికాకుండా తిరిగి డిప్యూటేషన్‌కు వెళ్లకూడదు. కానీ, ఈ అధికారిణి విషయంలో ఈ నిబంధనను పూర్తిగా విస్మరించి, ప్రొబేషన్ పూర్తి కాకుండానే డిప్యూటేషన్‌ను కొనసాగిస్తున్నారు.

చక్రం తిప్పుతున్న అధికారిణ పై.. చర్యలేవి?

వరుసగా 11 సంవత్సరాల పాటు డిప్యూటేషన్ మీద కొనసాగుతూ, నిబంధనలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్న ఈ అధికారిణి వెనుక ఉన్న రాజకీయ లేదా ఉన్నతాధికారుల హస్తం ఎవరిది? లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును శాసించే ఇంటర్మీడియట్ బోర్డులో అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ప్రకారం ఆమెపై చర్యలు తీసుకోవాలని మరియు ఆమె అక్రమార్జన పై విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News