- తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్
కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయిన నేపథ్యంలో డబుల్ రైజింగ్ కు అంచనాలకు మించి ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు రావడం రెండు సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వానికి నిదర్శనమని రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా డబల్ బోనంజా తేవడం పట్ల బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని, తెలంగాణ ప్రజల గీత, రాత మార్చేందుకు ప్రజా పాలన ప్రజల పాలిటి ఇలవేల్పుగా మిగిలిందని అన్నారు. సాంకేతికత ఆవిష్కరణ, సమర్థ ఆర్థిక నిర్వహణ, సుపరిపాలన ఈ మూడు ఉత్ప్రేరకాలే మూడంచల వ్యూహాలకు ఊతమిచ్చాయని క్యూర్, ప్యూర్, రేర్ తో పాటు పది కీలక వ్యూహాలతో రోడ్డు మ్యాప్ రూపొందించడం రాష్ట్ర ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించేందుకు రూపొందించిన డాక్యుమెంట్లు సహకరిస్తాయని అన్నారు.
రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో గత పది సంవత్సరాలుగా పరిపాలించిన నాయకులపై ఒక్క విమర్శ కూడా చేయకుండా తన పరిణతి ప్రదర్శించారని ప్రశంసించారు. అధికారమిచ్చిన పేద ప్రజలకు న్యాయం చేయాలన్న నిబద్ధత, జపాన్, దక్షిణ కొరియా తరహాలో సినీ గ్లోబల్ హబ్ గా హైదరాబాదు మార్చడం లాంటి డాక్యుమెంట్ల నిర్వహణ ప్రజా పాలన ప్రభుత్వానికే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన రెండు సంవత్సరాల లో గత పది సంవత్సరాలలో జరగని అభివృద్ధిని చవి చూసిందని, మరింత అభివృద్ధికి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెళుతుందని, ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వేరు మంత్రులు వేరు అని కాకుండా అందరి సమన్వయంతో రాష్ట్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతుంది అనడంలో అతిశయోక్తి లేదు అని నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు.
