- మిడిల్ ఈస్ట్ సంక్షోభ సమయంలో 24/7 కంట్రోల్ రూమ్
- 200కు పైగా విచారణల స్వీకరణ
పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో, అక్కడ నివసిస్తున్న తెలంగాణ వాసుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి శ్రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, తెలంగాణ ప్రభుత్వం అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తూ పౌరులకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోంది.
చురుగ్గా పనిచేస్తున్న కంట్రోల్ రూమ్
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన 24×7 కంట్రోల్ రూమ్ నిరంతరం అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను సమన్వయం చేస్తోంది. కంట్రోల్ రూమ్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ వారు మరియు వారి కుటుంబ సభ్యుల నుండి 200కు పైగా విచారణలు వచ్చాయని అధికారులు వెల్లడించారు.
నిరంతర పర్యవేక్షణ
రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ శశాంక్ గోయల్ ఈ కంట్రోల్ రూమ్ పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ భవన్‌లోని ఉన్నతాధికారులు భారత ప్రభుత్వం మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, మన పౌరులకు సకాలంలో సమాచారం మరియు పూర్తి మద్దతు అందేలా చూస్తున్నారని ఆయన అన్నారు
మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని తెలంగాణ పౌరులు లేదా వారి కుటుంబ సభ్యులు ఏ సమయంలోనైనా సహాయం కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ 24×7 కంట్రోల్ రూమ్
+91 9871999044
+91 9958322143
+91 9910014749
+91 9643723157
నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు
