Sunday, February 22, 2026
HomeతెలంగాణExcise Department | న్యూ ఇయర్ కిక్కులో తెలంగాణ ఎక్సైజ్ శాఖ

Excise Department | న్యూ ఇయర్ కిక్కులో తెలంగాణ ఎక్సైజ్ శాఖ

  • రికార్డ్‌ స్థాయిలో భారీగా కొనసాగిన మద్యం అమ్మకాలు..
  • 2025 డిసెంబరులో రూ.5,102 కోట్ల మద్యం విక్రయం..రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ చరిత్రలో ఇది అత్యధికం..
  • 2025తో పోలిస్తే 1,300 కోట్లకు పైగా లిక్కర్‌ సేల్స్‌..
  • వివరాలు వెల్లడిరచిన తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ అధికారులు..
  • కొత్త వ్యాపారం మొదటి నెలలోనే లాభాలు రావడంతో వ్యక్తమవుతున్న ఆనందం..

తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు నూతన సంవత్సర జోష్‌ మరింత కిక్కిచ్చింది. మంగళ, బుధవారాలు రెండు రోజుల్లో ఏకంగా రూ.750 కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబరు నెలలో మొత్తవ్మి?ద రూ.5,102 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబరు నెలకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ చరిత్రలో అమ్మకాలు, ఆదాయం ఇదే అత్యధికం కావడం గమనార్హం. అటు.. కొత్త మద్యం వ్యాపారులకు కూడా తొలినెలలోనే కాసుల వర్షం కురిసింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 2024 డిసెంబరులో రూ.3,800 కోట్లు, 2023 డిసెంబరులో రూ.4,297 కోట్లు మాత్రమే.

గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి రూ.1,300 కోట్లకుపైగా అధికంగా మద్యం విక్రయాలు జరిగాయి. భారీగా మద్యం విక్రయాలు ఉండవచ్చని ముందుగానే అంచనా వేసిన ఎక్సైజ్‌శాఖ స్టాక్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. కాగా, రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ ద్వారా నవంబర్‌లో దుకాణాలను కేటాయించగా.. డిసెంబరు ఒకటో తేదీ నుంచి కొత్త వ్యాపారులు విక్రయాలు ప్రారంభించారు. వారికి డిసెంబరులో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం, తర్వాత క్రిస్మస్‌, ఇప్పుడు నూతన సంవత్సర వేడుకలు కలిసి వచ్చాయి.

- Advertisement -

డిసెంబరు తొలి రెండు వారాల్లో పెళ్లిళ్లు, పర్యాటక ప్రాంతాల్లో ఈవెంట్లతోనూ మద్యం అమ్మకాలు పెరిగాయి. డిసెంబరు 30న ఒక్క రోజే రూ.375 కోట్ల విక్రయాలు నమోదవ్వగా.. 31న సాయంత్రానికే అమ్మకాలు రూ.350 కోట్లు దాటేశాయి. అర్ధరాత్రి 12గంటల వరకు మద్యం దుకాణాలు, ఒంటి గంట వరకు బార్లు తెరిచి ఉంచేందుకు ఎక్సైజ్‌శాఖ అనుమతి ఇవ్వడంతో అమ్మకాలు భారీగా నమోదయ్యినట్లు తెలుస్తోంది.. కొత్త వ్యాపారులకు తొలినెలలోనే మంచి ఆదాయం రావడంతో ఆనందం వ్యక్తమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News