Thursday, March 26, 2026
HomeతెలంగాణCM Revanth Reddy | ‘సఫ్రాన్’ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం

CM Revanth Reddy | ‘సఫ్రాన్’ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం

ప్రపంచ ప్రఖ్యాత సఫ్రాన్ ఏరోస్పేస్(Safran Aerospace) సంస్థ శంషాబాద్‌లోని GMR ఏరోపార్క్‌లో నెలకొల్పిన LEAP Engine (లీప్ ఇంజిన్) MRO ప్రారంభోత్సవంతోపాటు M88 MRO శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిఫెన్స్ ఏవియేషన్ హబ్‌గా తెలంగాణ తన ప్రత్యేకతను చాటుతోందని చెప్పారు. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ తయారీ కారిడార్‌ను మంజూరుచేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో పాల్గొనాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. దేశంలో రక్షణ, వైమానిక రంగ బలోపేతానికి కీలకమైన ఈ ప్రాజెక్టులను ప్రధాని మోదీ (PM Modi) వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu), రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu), అధికారులు, సఫ్రాన్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. (MRO అంటే మెయింటనెన్స్, రిపేర్, ఆపరేషన్స్).

- Advertisement -
RELATED ARTICLES

Latest News