ఓ అణచబడిన తల్లి కడుపు నుండి పుట్టిన పాల బుగ్గల పసి పాప.. ఆ తల్లి చనుబాల పాల బొట్లు కడుపు నిండా, తాగకముందే నిన్ను అగ్రకుల అహంకారం కాలితో తన్ని కాటికి పంపితే.. కనికరం లేని సమాజంలో కాస్తయినా చలనం లేదే.. గ్రామ పాలకుల నుండి రాష్ట్ర పాలకుల వరకు అందరూ న్యాయాన్ని నల్ల ముసుగుతో మూసేస్తే.. కళ్ళు తెరచి ఈ సమాజాన్ని చుడకుండానే మీ అగ్ర అహంకారంతో పసి బిడ్డని బొంద పెడితిరి కదరా.. నీతి లేని నాయకులారా..! తల్లి కడుపు కోత తీర్చలేని తెలంగాణ తల్లి కన్నీటి దారను ఎవరు ఆపగలరు..?
- ముచ్కూర్ సుమన్ గౌడ్
- Advertisement -
