Tuesday, February 24, 2026
Homeబిజినెస్TekIT | భారీగా పెరిగిన టేక్ సొల్యూషన్స్ షేర్ వ్యాల్యూ..

TekIT | భారీగా పెరిగిన టేక్ సొల్యూషన్స్ షేర్ వ్యాల్యూ..

  • 5 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్న వైనం..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాల్లో ఉండగా, టేక్ సొల్యూషన్స్ లిమిటెడ్ షేరు మాత్రం 5 శాతం పెరిగింది. ఇంట్రాడే గరిష్టం రూ. 49కి చేరింది. ఈ స్మాల్ క్యాప్ గత ఏడాది కాలంగా అదరగొడుతోంది. మల్టీబ్యాగర్ గా అవతరించి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది.

టేక్ సొల్యూషన్స్ గ్లోబల్ ఏ.ఐ. డ్రివెన్ హెల్త్‌కేర్ సంస్థ. ఇది ఆంథ్రోపిక్ అడ్వాన్స్‌డ్ ఏ ఐ టూల్ క్లాడ్ ను తన సిస్టమ్‌లో ఇంటిగ్రేట్ చేసింది. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో వెల్లడించింది. ఈ ఏ ఐ టూల్ సాయంతో కంపెనీ కాంప్లెక్స్ మెడికల్, క్లినికల్, ఆపరేషనల్ డేటాను సురక్షితంగా, పెద్ద స్కేల్‌లో ప్రాసెస్ చేయగలదు. ఇది కంపెనీకి పెద్ద మైలురాయి అని చెప్పవచ్చు. ఇకపై స్కేలబుల్, ఇంటెలిజెంట్, ప్రివెంటివ్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్‌లు బిల్డ్ చేయడానికి టూల్ సహాయపడుతుంది.

- Advertisement -

టేక్ సొల్యూషన్స్ చైర్మన్ పరమేశ్వర్ ధంగారే మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ జనరేషన్ హెల్త్‌కేర్‌కు బేస్ అవుతోందన్నారు. క్లాడ్ ఏ ఐ ఇంటిగ్రేషన్ తమ టెక్నాలజీని బలపరుస్తుందని, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ పెరుగుతుందని చెప్పారు. ఇన్నోవేషన్ వేగవంతమవుతుందన్నారు. ప్రిడిక్టివ్ మరియు ప్రివెంటివ్ ఇంటెలిజెన్స్‌తో హెల్త్‌కేర్‌ను మార్చాలనేది తమ విజన్ అని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News