భారత రక్షణ రంగంలోని వివిధ విభాగాల్లో 30 ఉద్యోగాలను తేజస్ విద్యార్థులు సాధించినట్లు తేజస్ డిఫెన్స్, జూనియర్ కళాశాలల చైర్మన్ సిహెచ్ సతీష్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రావు మాట్లాడుతూ మా తేజన్ డిఫెన్స్ అకాడమీకి చెందిన 30 మంది విద్యార్థులు డిఫెన్స్ రంగంలో అత్యంత ప్రతిభ చూపి ఉద్యోగాలు సాధించారని వీరిలో 15 మంది విద్యార్థులు ఇండియన్ నేవీ సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్ (SSR) ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగిందనీ వీరందరూ ఫిబ్రవరి నెల ట్రైనింగ్ సెంటర్లు లో రిపోర్ట్ చేయాల్సి ఉందనీ.
అదే విధంగ 15 మంది విద్యార్థులు ఎస్ ఎస్ సి జి డి (సిఐఎస్ఎఫ్, బి ఎస్ ఎఫ్ సిఆర్పిఎఫ్, అస్సాం రైఫిల్స్) ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగిందనీ. విరందరూ ఫిబ్రవరి నెల ట్రైనింగ్ సెంటర్లో లో రిపోర్ట్ చేయాల్సి ఉందినీ మా విద్యార్థులు 30 మంది ఉద్యోగులు సాధించడం పట్ల తమకు ఎంతో గర్వకారణంగా ఉందని భవిష్యత్తులో దేశ సేవలో నిమగ్నమై మరింత ఉన్నత స్థాయిలో నిలవాలని అన్నారు వరుసగా.
మా తేజస్ నుండి విద్యార్థులు కాంపిటీటివ్ ఎగ్జామ్ లలో ప్రతిభ కనబర్చి ఉద్యోగాలు సాదిస్తునందుకు మాకు సంతోషంగా ఉంది. మా తేజన్ లో 2026-27 విద్యాసంవత్సరం నుండి బాలికలకు కూడా డిఫెన్స్ కోచింగ్ ప్రారంభిస్తున్నామని అదే విధంగ ఐఐటి- జేఈఈ మరియు నీట్ లో కూడా మా విద్యార్థులు ర్యాంకులు సాదించాలని ఎలావేట్ అనే ప్రత్యేక ప్రోగ్రామ్ ని ప్రారంబించడం జరిగిందనీ ఇది హైదరాబాద్ లోని శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లెర్న్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామనీ తెలియజేశారు
