Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeస్పోర్ట్స్58 ఏళ్లుగా ఎడ్జ్‌బాస్టన్‌ లో గెలవని టీమిండియా

58 ఏళ్లుగా ఎడ్జ్‌బాస్టన్‌ లో గెలవని టీమిండియా

ఎడ్జ్‌బాస్టన్‌ లో ఇప్పటి వరకు 8 టెస్ట్‌లు ఆడిన టీమిండియా.. ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. ఏడు మ్యాచ్‌ల్లో ఓడిన టీమిండియా ఒకే ఒక్క మ్యాచ్‌ డ్రా చేసుకుంది. అది కూడా 39 ఏళ్ల క్రితం(1986) డ్రా చేసుకుంది. 1967 నుంచి ఈ మైదానంలో టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడుతున్న టీమిండియా ఒక్క విజయం సాధించలేదు. 2022లో చివరిసారిగా ఇక్కడ జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 378 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించింది.

ఈ వేదికపై విరాట్‌ కోహ్లీ , రిషభ్‌ పంత్‌కు మెరుగైన రికార్డ్‌ ఉంది. ఎడ్జ్‌బాస్టన్‌ పిచ్‌ సాంప్రదాయకంగా పేస్‌ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తొలి రెండు రోజులు పేస్‌కు సహకరిస్తోంది. వాతావరణం చల్లగా ఉండి, పిచ్‌పై పచ్చ గడ్డి ఉంటే బంతి స్వింగ్‌ అవుతోంది. మ్యాచ్‌ సాగుతున్నా కొద్ది పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతోంది. ఆట ఆఖరి రోజుకు చేరితే పిచ్‌పై పగుళ్లు ఏర్పడి స్పిన్‌కు అనుకూలిస్తోంది. ఇక్క టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకోవడానికి మొగ్గు చూపుతోంది. పిచ్‌ కండిషన్స్‌ నేపథ్యంలో రెండో టెస్ట్‌లో బుమ్రా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News