Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్Tea Party | ఏపీ లోక్ భవన్‌లో తేనీటి విందు

Tea Party | ఏపీ లోక్ భవన్‌లో తేనీటి విందు

77వ గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్(AP Governor Abdul Nazeer), ప్రథమ మహిళ సమీరా నజీర్ సోమవారం లోక్ భవన్ లాన్స్‌లో తేనీటి విందును సుహృద్భావ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు(CM Chandrababu), ఆయన సతీమణి భువనేశ్వరి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఆయన సతీమణి గుడియా ఠాకూర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ఆయన సతీమణి అన్నా లెజ్నెవా తదితరులు హాజరయ్యారు.

శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానం, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఐటీ & మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి కె.శ్రీనివాస్, ఎంఏ & యూడీ మంత్రి నారాయణ, ఎక్సైజ్ మంత్రి రవీంద్ర, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్లు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు, రక్షణ శాఖ సిబ్బంది, క్రీడాకారులు, పద్మ అవార్డు గ్రహీతలు, మీడియా ప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, మహిళా సర్పంచ్‌లు, మెరిట్ విద్యార్థులు, ఎన్జీఓల ప్రతినిధులు వంటి ప్రత్యేక ఆహ్వానితులు ఈ తేనీటి విందుకు హాజరైన ఇతర ప్రముఖుల్లో ఉన్నారు. ముందుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ వేదిక చుట్టూ వెళ్లి అతిథులందరినీ మర్యాదపూర్వకంగా పలకరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News