Tuesday, March 3, 2026
Homeఖమ్మంTDP | టిడిపి నాయకులు రామచంద్రు మరణం తీరని లోటు

TDP | టిడిపి నాయకులు రామచంద్రు మరణం తీరని లోటు

  • పాలేరు నియోజకవర్గ బాధ్యులు కొండబాల కరుణాకర్

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి రామచంద్రు మరణం పార్టీకి తీరని లోటని పాలేరు నియోజకవర్గ బాధ్యులు కొండబాల కరుణాకర్ తెలిపారు.తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు గ్రామ శాఖ అధ్యక్షులు గొర్రెపాటి క్రిష్ణమోహన్ తండ్రి రామచంద్రు బుధవారం వయోభారంతో వారి స్వగృహంలో కన్నుమూశారు.సమాచారం తెలుసుకున్న కరుణాకర్ పార్టీ శ్రేణులతో కలిసి రామచంద్రు భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

కుమారుడు కృష్ణ మోహన్ ను పరామర్శించి,ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ఆవిర్భావం నుండి క్రమశిక్షణ కలిగిన క్రియాశీలక కార్యకర్తగా పార్టీలో కొనసాగుతూ ఈ ప్రాంతంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు నామా ప్రసాద్,ఉపాధ్యక్షులు కొలిశెట్టి భిక్షం,తెలుగు యువత నాయకులు మల్లెంపాటి లహరిన్,దాసరి జనార్ధన్,గొర్రెపాటి సైదులు,గ్రామ నాయకులు,తదితరులు పాల్లొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News